అమృత పార్క్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

  • విజయవంతంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరుతుంది
  • ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది
సూర్యాపేట: పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 42వ వార్డులో 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అమృత పార్క్ ను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన తెలిపారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, స్థానిక వార్డు మెంబర్ రాజశ్రీ నాగార్జున, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press News