యజ్ఞంలా కొనసాగుతున్న పట్టణ ప్రగతి

  • చురుకుగా పాల్గొంటున్న అధికారులు, ప్రజలు
  • ప్రతీఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
  • కరీంనగర్ లో ఐదో రోజు హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రగతిని సాధించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు యజ్ఞంలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రేకుర్తి 19వ డివిజన్ లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రతీ ఒక్కరూ విదిగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను కుటుంబ సభ్యుల్లాగా కాపాడాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభంతో ప్రాణవాయువు విలువ ప్రతీ ఒక్కరికీ తెలిసిందని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మనందరం ఇంటికి ఆరు మొక్కల్ని నాటి సంరక్షించాలన్నారు. అవకాశం ఉన్న ప్రతీ చోట మొక్కల్ని నాటి వాటిని మహా వృక్షాలుగా ఎదిగేలా చూడాలన్నారు. కాంక్రీట్ జంగిల్లో సైతం హరిత వనాల్ని పూయించాలనే కంకణం కరీంనగర్ ప్రజలు పూనుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ కళా స్వరూపారాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లు ఎదుల్లా రాజశేఖర్, సుధ గోని మాధవి- కృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ నందేల్లి ప్రకాష్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More Press News