పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలం మరో ఏడాది పాటు పొడగింపు.. ఉత్తర్వులు అందజేత
హైదరాబాద్: పశుసంవర్ధక శాఖలో 75 మంది కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత వైద్యులకు అందజేసినట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న పశువైద్యాదికారులలో కొందరికి మంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ సర్వీసును పొడగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. మిగిలిన వారికి ఆయా జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా అందజేసినట్లు తెలిపారు.
నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా మంచి గుర్తింపును పొందాలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడిన పశువైద్యాదికారులను మంత్రి కోరారు. పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల సేవలు అవసరమని భావించి వారి సర్వీస్ ను మార్చి 31వ తేదీ 2022 వరకు పొడగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే.