జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ కంట్రోల్ రూమ్.. ప్రత్యేక నంబర్ ఏర్పాటు

  • కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా వైద్య సహాయాలు, సూచనలు
  • 040 - 21111111 కంట్రోల్ రూమ్ కు ప్రత్యేకంగా కేటాయింపు
హైదరాబాద్, మే 3: గ్రేటర్ హైదరాబాద్ లో కోవిడ్ సంబంధిత వైద్య సహాయాన్ని, కోవిడ్ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు సూచనలను అందించేందుకై జీహెచ్ఎంసీ కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి వైద్యులను ప్రత్యేకంగా నియమించారు.

ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రెండు గంటలనుండి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్తులలో ఈ వైద్యులు కంట్రల్ రూమ్ నుండి ఫోన్ ల ద్వారా కోవిడ్ నివారణకై సలహాలు, సూచనలిస్తారు. కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తించే వైద్యులకు నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక ఓరియెంటేషన్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంతోష్, వైద్య శాఖ ఓ.ఎస్.డి. గంగాధర్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపాదక చర్యలు చేపడుతోందని అన్నారు.

దీనిలో భాగంగా జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి దీనిలో 040 - 21111111 అనే నంబర్ ను ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో కోవిడ్ లక్షణాలుంటే, తగు వైద్య సలహాలు సూచనలకు, కావాల్సిన వైద్య కిట్ లకై ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 104 కు వచ్చే కాల్స్ లను కూడా కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్ కు అనుసందానం చేస్తున్నట్లు రిజ్వి తెలిపారు.

కోవిడ్ లక్షణాలుంటే వెంటనే టెస్టులనీ, పరీక్షలనీ, స్కాన్ లని వెళ్లోద్దని ముందస్తుగా ఐదు రోజులపాటు మందులు వాడాలని వైద్య శాఖ ఓ.ఎస్.డి గంగాధర్ సూచించారు. అవసరమైన వారికి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల ద్వారా మెడికల్ కిట్ లను అందచేస్తున్నట్టు రాహుల్ బొజ్జా అన్నారు. అనంతర, జీహెచ్ఎంసీ కోవిడ్ కంట్రోల్ రూమ్ ను వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి సందర్శించారు. కంట్రోల్ రూమ్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

More Press News