శామీర్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీకా ఉత్సవ్
హైదరాబాద్: ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్ సలహాదారు బి.పి ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గురువారం నాడు మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్ పేటలోని జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్కులో దాదాపు తొంభై మంది శాస్త్రవేత్తలకు, వివిధ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు శామీర్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీకా ఉత్సవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బి.పి ఆచార్య మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారి దేశంలో రెండో దశ ఉధృతంగా కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. జీనోమ్ వ్యాలిలో టీకా ఉత్సవ్ రెండవ సారి నిర్వహించామనీ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని, వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పక పాటించాలని సూచించారు. టీకా ఉత్సవ్ నిర్వహించినందుకు నిర్వాహకులకు ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శామీర్ పేట డాక్టర్ శ్రీకాంత్, ఐకేపి ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.