నేల తల్లి బాగుంటేనే.. భవిష్యత్తు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: నేలతల్లి బాగుంటేనే.. మనం బాగుంటాం. భావితరాలు బాగుంటాయని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు.

భూమిపై లభించే సహజ వనరులను మనం ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హని జరుగుతోందని వెల్లడించారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తొందన్నారు. భూమాతకు ఎటువంటి హానీ కలుగకుండా కాపాడుకోవాలని ప్ర‌పంచ‌ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు.

భూమిని కాపాడుకోవటానికి పర్యావరణం, వాతావరణంతోపాటు మానవుని జీవనశైలిలో మార్పు రావాలని సూచించారు. పూడమి తల్లిని కాపాడుకునేందుకు మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

మనిషి బ్రతికేందుకు కావాల్సిన ఆక్సిజన్ ను పొందడానికి చెట్లు చాలా అవసరమని వాటి ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణులు, జీవ వైవిధ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.

More Press News