ఫార్మా సిటీ మెగా వెంచర్ పనులను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, టిఎస్ఐఐసి ఎండి నరసింహ్మ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్ లతో కలిసి వెంచర్ పనులకు భూమి పూజ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ మంత్రి కామెంట్స్:
  • నూతన పట్టణం నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. 
  • ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా కంపెనీ ఈ ప్రాంతంలోకి రావటం సంతోషం. 
  • ఎకరానికి ఒక గుంట,హోసింగ్ లే ఔట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. 
  • ఒక ఎకరాకు 121 గజాలు, రెండు ఎకరాలకు 242 గజాలు ఆపైన ఉన్న వారికి భూమి.
  • కేవలం లే ఔట్ మాత్రమే కాకుండా అన్ని రకాల సౌకర్యాల కల్పన కు నిధులు మంజూరు. 
  • మరో హైటెక్ సిటీగా ఈ ప్రాంతం మారనుంది. 
  • సేకరించిన 14000 ఎకరాల్లో తిరిగి 600 ఎకరాలు రైతులకు ఇళ్ల స్థలాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది.
  • కాలుష్యం లేకుండా ప్రపంచంలో ఆధునిక టెక్నాలజీ తో నిర్మాణం, అపోహలు వద్దు అందరూ ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి రావాలి.
  • 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు.
  • ప్రతి సెక్టార్ కు డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు.
  • ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు, స్కూల్ లు, పిహెచ్ సిలు, కమ్యూనిటీ హల్ లతో పాటు షాపింగ్ మాల్ లు లాంటి అన్ని రకాల సౌకర్యాలతో ఒక నూతన పట్టణంగా ఫార్మా మెగా సిటీ.
  •  ఒక ఉద్యోగం కూడా ఇవ్వటానికి, అర్ఘత ఉన్న వారికి రెండో ఉద్యోగం ఇచ్చేలా కృషి. 
  • యువత  నైపుణ్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు వచ్చేలా కృషి. 
  • ఫార్మా రంగానికి సంభందించి యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం. 
  • ప్రాజెక్ట్ కన్న ముందే హోసింగ్ పూర్తి చేసేలా కృషి.
  • 750 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం భూ సేకరణకు డబ్బులు ఇవ్వగా, మరో 300 కోట్లు ఇటీవలే విడుదల అయ్యాయి.

More Press News