డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని హోంశాఖా మంత్రి నివాళులు

 హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఐన భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. దేశానికి డా.అంబేద్కర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డా.అంబేద్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చెప్తూ ఉంటారని తెలియ జేశారు.

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రూపుదిద్దుకునే ప్రక్రియకు అంబేద్కర్  స్ఫూర్తి కారణమని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా హోం మంత్రి గుర్తు చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో  పాటుఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకులపాఠశాలల్లో నాణ్యమై విద్యను అందిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం పరిఢవిల్లెంత వరకు డాక్టర్ అంబేద్కర్ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు.

More Press News