శాసనసభ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన సభాపతి పోచారం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ యంయస్ ప్రభాకర్ రావు, పలువురు శాసనసభ్యలు, మండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి.నరసింహా చార్యులు.
ఈ సందర్భంగా సభాపతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. రాజ్యాంగ ఫలాలను దేశ ప్రజలకు అందించిన మహానీయుడు డా.బీఆర్ అంబేద్కర్. అంతటి గొప్ప వ్యక్తి 130వ జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు ఒక కులానికో, మతానికో ప్రతినిది కాదు, యావత్ భారతదేశానికి ఆదర్శమైన వ్యక్తి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంబేద్కర్ గారు స్పూర్తి. చిన్న రాష్ట్రాలతోనే ప్రజలకు మంచి పరిపాలన అందుతుందన్న అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాదించారు.
సాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనా విదానానికి అనుగుణంగా పరిపాలన సాగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా దళత, గిరిజన, వెనుకబడిన వర్గాలను కడుపులో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది.
అంబేద్కర్ గారు సూచించిన బాటలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తే ఏ వర్గానికి కూడా సమస్యలు ఉండవు. అంబేద్కర్ గారి స్పూర్తితో అన్ని రాష్ట్రాలు పనిచేయాలి. తిట్టుకోవడం, విమర్శించుకోవడం రాజకీయం కాదు. ప్రజలు పనిచేయడానికి ప్రజాప్రతినిధులుగా మనలను ఎన్నుకున్నారు.
అంబేద్కర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే మనమందరం కలిసి దేశ, రాష్ట్ర ప్రగతి సంక్షేమానికి పునరంకితం కావాలని తెలిపారు. అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు, దేశం అభివృద్ధి చెందుతుంది. మన ప్రతి అడుగు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాను.