పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలి: పీవీ ప్రభాకర్ రావు
హైదరాబాద్: స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పీవీ కుమారుడు పి వి ప్రభాకర్ రావు కోరారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగుతేజం జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అక్షర దీక్ష సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
సాహిత్యా, కళా, సామాజిక సేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన 80 మందికి ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పివి ప్రభాకర్రావు, తనుగుల జితేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు, మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని కొనియాడారు.
కళలు, సాహిత్యం అంటే ఎంతో ఆసక్తితో ఉండేవారని జ్ఞానపీఠ్ అవార్డు కమిటీ చైర్మన్ గా ఉండి ఎంతో సేవ చేశారన్నారు. దేశ ప్రధానిగా విశిష్ట సేవలందించిన పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.