రేపు పబ్లిక్ గార్డెన్ లో 'ఉజ్వల ప్రస్థానం' పుస్తక ఆవిష్కరణ!

తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, రాజవంశాలు, ఉద్యమాలు, పరిపాలనా విధానం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రగతి, ఇతర ముఖ్య పరిణామాలపై సీఎం పీఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రూపొందించిన సవివరణమైన, సాధికారిక గ్రంథం ‘ఉజ్వల ప్రస్థానం’ ఆవిష్కరణ గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో గల జూబిలీ హాల్ లో జరగనుంది.

చారిత్రక పూర్వయుగం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన పరిణామ క్రమాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ రచయిత విజయ్ కుమార్ ఈ పుస్తకంలో వివరణాత్మకంగా పొందుపరిచారు. ఈ పుస్తకంతో పాటు ‘బంగారు బాట’ పేరుతో విజయ్ కుమార్ రూపొందించిన వ్యాస సంకలనం పరిచయం కూడా ఇదే సభలో నిర్వహిస్తారు.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, , సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

More Press News