మూడు కేటగిరీలలో జాతీయస్థాయి అవార్డులు సాధించిన హైదరాబాద్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వమునకు చెందిన India Trade Promotion Organisation (ITPO) Department of Commerce and Exhibition India Group (EIG) ల ఆధ్వర్యంలో ఈ నెల 24 నుండి 26 వరకు న్యూఢిల్లీ ప్రగతి మైదాన్ లో నిర్వహించిన 28వ కన్వర్జెన్స్ ఇండియా -2021 International Exhibition మరియు 6వ Smart Cities India Expo లో హైదరాబాద్ కు వివిధ కేటగిరీలలో మూడు అవార్డులు లభించాయి.

న్యూఢిల్లీలో నేడు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి  శాఖకు చెందిన HGCL , MD బి.యం.సంతోష్, జీహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ అదనపు కమీషనర్ బి.సంతోష్ మరియు ఎన్.ఐ.యు.యం. అవుట్ రీచ్ మేనేజర్ వంశీ కోండుజూ లు ఈ అవార్డులు అందుకున్నారు.

అవార్డుల వివరాలు:
  • కేటగిరి -1 లో గ్రీన్ అండ్ క్లీన్ సిటీ క్రింద బేగంపేట ప్లై ఓవర్ వద్ద అభివృద్ధి చేసిన రెయిన్ గార్డెన్ కు అవార్డు లభించింది. కూకట్ పల్లి మరియు యుసుఫ్ గూడల నుండి వచ్చే సివరేజి నాలాలు బేగంపేట ప్లై ఓవర్ క్రింది భాగంలో కలుస్తాయి. ఈ రెండు నాలాలు కలిసి ప్రవహించే సివరేజి నాలా వున్న చోట 400 మీటర్ల పొడవున 5 ఎకరాల విస్తీర్ణంలో రెయిన్ గార్డెన్ ను HMDA అభివృద్ధి చేసింది.
  • కేటగిరీ -2 లో Smart Waste Disposal Project క్రింద న్యూమున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు అవార్డు లభించింది. ఘన వ్యర్ధాల సేకరణ, రవాణాకు దేశంలోనే అత్యంత ఆధునిక, పర్యావరణహిత, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. స్మార్ట్ సెల్ఫ్ కంపాక్టు  సీల్డ్ వాహనాల ద్వారా వ్యర్ధాలను తరలిస్తున్నారు. పూర్తి స్థాయి యాంత్రీకరణ నెట్ వర్క్ తో నగర వ్యాప్తంగా సెకండరీ కలెక్షన్, టాన్స్ పోర్టు పాయింట్స్ (SCTPs) అనుసందానమై వున్నాయి. ఘనవ్యర్దాల సేకరణ, తరలింపులో దేశంలోని అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని, వాహనాలను వినియోగిస్తున్నారు.
  • కేటగిరీ -3 క్రింద WE HUB కు Startup Award లభిస్తుంది. WE HUB ద్వారా మహిళ సాదికారితకై కమ్యూనిటీ సహకారంతో మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చేందుకు వినూత్నంగా తీసుకున్న చొరవకు గుర్తింపు లభించింది. పరిశ్రమలు నెలకొల్పుటకు, అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకొనుటకు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుటకు, వ్యాపారాభివృద్ధికి WE HUB వేదికగా నిలుస్తున్నది.
నగరాలు, గ్రామాలను జీవించుటకు అనుకూలమైన వాటిగామార్చి, ఆ పరిస్థితులను కొనసాగించుటకు ఆర్ధికంగా స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ తో రూపొందించిన Models, Best Practices అమలు చేస్తున్నారు. Smart City concept తో పనిచేస్తున్న వ్యక్తులు, విదాన రూపకర్తలు, కంపెనీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థలు, అసోసియేషన్ లను గుర్తించి, ప్రోత్సహించేందుకై సత్కరించుటకు Smart Cities India Expo వినూత్న వేదికగా నిలుస్తున్నది.

ఉన్నతస్థాయి జ్యూరి గత 5 సంవత్సరాలుగా 800 పైబడిన ఎంట్రీలను పరిశీలించి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈ సంవత్సరం వివిధ కేటగిరీల క్రింద 586 ఎంట్రీలు వచ్చాయి. ఈ దరఖాస్తులను 10 మంది సభ్యుల న్యాయ నిర్ణేతల జ్యూరీస్ర్కూటిని చేసి Smart City Award లకు ప్రాజెక్టులను ఎంపిక చేసింది.

More Press News