27న జగన్మాత దుర్గమ్మకు వెలంపల్లి అశ్విత ముత్యాలహారం సమర్పణ
- రూ 20 లక్షలతో వెలంపల్లి ట్రస్ట్ విరాళంతో నిర్మించిన పిండప్రధానం రేకుల షెడ్డు ప్రారంభోత్సవం
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వెలంపల్లి అశ్విత జన్మదినం సందర్భంగా జగన్మాత కనకదుర్గమ్మకు అలంకరించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన 260 గ్రామల బంగారం కూడిన 6 లైన్లుగల 16 లక్షల రూపాయల విలువ గల ముత్యాల హారంను 27వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు కానుకగా సమర్పిస్తారని మంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు దుర్గఘాట్ వద్ద 3500 అడుగల విస్తీర్ణంలో వెలంపల్లి మహాలక్ష్మమ్మ, అవినీష్ చారిటబుల్ ట్రస్ట్ 20 లక్షల రూపాయలతో నిర్మించిన పిండప్రధానం రేకుల షెడ్డును వెలంపల్లి అశ్విత ప్రారంభించిన అనంతరం 100 మంది బ్రహ్మణులకు వస్త్రాలను బహుకరిస్తారు.