రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రశంసించిన గవర్నర్ తమిళిసై
- స్వాత్రంత్య పోరాట ఘట్టాలను చాటిచెప్పిన చాయాచిత్ర ప్రదర్శన
- `ఆజాదీ కా అమృత్ వర్ష్` వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ గ్రౌండ్స్‌లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్
- దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాటం సల్పిన వారిని స్మరించుకున్న గవర్నర్
- కరోనాపై అవగాహన కల్పించే డిజిటల్ ప్రసార వాహనాలను తిలకించిన రాష్ట్ర గవర్నర్
ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన వారికి స్వాత్రంత్య పోరాటం యొక్క ఉద్విగ్న ఘట్టాలు గుర్తుకు వస్తాయని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ డిజిటల్ ప్రచార వాహనాలను కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిలకించారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు తగు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, దక్షిణ భారతదేశ డైరెక్టర్ జనరల్ వేంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా `ఆజాదీ కా అమృత్ వర్ష్` కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ యొక్క రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో హైదరాబాద్ విభాగం ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు వేదికగా ఈ ఎగ్జిబిషన్ ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, ఆర్ఓబీ అధికారులు శ్రీధర్ సూరునేని, అర్ధ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.