జాతీయ, రాష్ట్ర రహదారులకు త్వరితగతిన అటవీ అనుమతులపై అరణ్య భవన్ లో సమావేశం

  • హాజరైన అటవీ శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీ ఉన్నతాధికారులు
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, త్వరిత గతిన పనులు, వేగంగా అటవీ అనుమతుల తాజా స్థితిపై అరణ్య భవన్ లో సమీక్షా సమావేశం జరిగింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ, జాతీయ రహదారుల సంస్థ సలహాదారు ఏ.కే.జైన్ హాజరయ్యారు.

వివిధ దశల్లో ఉన్న 29 రోడ్ల అనుమతులు, పురోగతిపై ప్రధానంగా సమావేశంలో సమీక్షించారు. మొదటి దశ అనుమతులు, రెండో దశ అనుమతులకు కావాల్సిన పనులను వేగవంతంపై రెండు శాఖల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. సంగారెడ్డి – నాంధేడ్ – అకోలా, హైదరాబాద్ – మన్నెగూడ, నిజామాబాద్ – జగదల్ పూర్, మంచిర్యాల- చెన్నూరు, హైదారాబాద్ – భూపాలపల్లి జాతీయ రహదారుల విస్తరణతో పాటు, ఇతర రోడ్ల అనుమతులపై సమావేశంలో వివరంగా చర్చించారు.

అలాగే అన్ని జాతీయ రహదారుల వెంట పచ్చదనం పెంపు, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ అభివృద్ది మోడల్స్ పై చర్చించారు. కొన్ని రహదారుల వెంట కొద్ది కిలో మీటర్ల మేర ప్రాంతాలను ఎంపిక చేసి పైలట్ ప్రజెక్ట్ లో భాగంగా మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, వాటి ఫలితాల ఆధారంగా విస్తరించాలని నిర్ణయించారు.

సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.దోబ్రియల్, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి ఏ. కృష్ణ ప్రసాద్, ఎస్.కే. కుష్వాహా, జాయింట్ అడ్వయిజర్ కే.ఎస్. రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఎం.రవీందర్ రావు, పీ. సాగేశ్వర రావు, పీ. ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press News