సెట్విన్ సంస్థ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ సమాచారం కోసం రూపొందించిన వెబ్ సైట్ ను YAT&C శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తో కలసి ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెట్విన్ సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెట్విన్ శిక్షణ సంస్థను ఆధునిక శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో సెట్విన్ హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాల్లో మాత్రమే సేవలనందించేది కానీ, నేడు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్ర కేంద్రాలలో ఏర్పాటును వేగవంతం చేస్తున్నామన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో 7 STEP ద్వారా 24 కేంద్రాలను, ప్రాంఛేజ్ ల ద్వారా 60 శిక్షణ కేంద్రాలలో శిక్షణ తరగతులను 47 అంశాల్లో నిర్వహిస్తున్నమన్నారు.

సెట్విన్ సంస్థ ఉద్యోగులు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని, ప్రవేట్ ఉద్యోగాల సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

More Press News