తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలకు తక్షణం మంచినీటి సౌకర్యం కల్పించండి: మంత్రి కేటీఆర్
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ లోపల ఉన్న కొల్లూరు, ఉస్మాన్ సాగర్ ప్రాంతాలకు తక్షణం మంచినీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు అధికారులను ఆదేశించారు. కొల్లూరు, ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు అనేక విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్లు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.
చాలా తక్కువ సమయంలోనే వేలాది నివాస గృహాలు వస్తున్నందున ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వెంట వేస్తున్న 3000ఎంఎం డయా పైపులైను ద్వారా ఆ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్బి అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ ఏరియా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు బుధవారం కేటీఆర్ ను కలిసి కొల్లూరు, ఉస్మాన్ సాగర్ పరిధిలో కొత్తగా వెలిసే ఇండ్ల కోసం 4 ఎంఎల్డి నీరు అవసరమని విన్నవించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.