'ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో భాగంగా కేంద్రమంత్రితో వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు వర్చువల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవిన్యూ హాల్ లో ఉన్న వర్చువల్ సెంటర్ నుండి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని హకీమ్ పెట్ లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు గా ఎంపికైన నేపథ్యంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు (KISCE) సెంటర్ తెలంగాణను మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్ అండ్ స్పోర్ట్స్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంకితం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి తెలిపారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ స్టేడియం నిర్మాణంను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వారకు 100 స్టేడియంల నిర్మాణం చేస్తున్నమన్నారు. అందులో ఇప్పటికే 45 స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామన్నారు.

ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు (KISCE) సెంటర్ తెలంగాణలో ఫెన్సింగ్, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కల్పించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేoదుకు ఈ స్పోర్ట్స్ ఎక్సలెన్సు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీర్చిదిద్దుతున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అదనపు కలెక్టర్ నందలాల్ తేజస్ పవార్, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ డైరెక్టర్ హరికృష్ణ, పలువురు కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

More Press News