ఏలూరు వాసుల అస్వస్ధత పట్ల ఏపీ గవర్నర్ ఆందోళన

ఏలూరు వాసుల అస్వస్ధత పట్ల ఏపీ గవర్నర్ ఆందోళన
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్ధతకు గురి కావటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. స్ధానిక పరిస్ధితులపై అరా తీసిన ఆయన వైద్య ఆరోగ్య శాఖ మరింత వేగవంత చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. బాధితులకు సత్వరమే వైద్య సహాయం అందేలా చూడాలని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరాంచాలని స్పష్టం చేశారు. సమస్యకు కారణం ఏమిటన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం చేస్తుండగా, ఉన్నత స్ధాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని గవర్నర్ వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

More Press News