ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులులు.. చర్యలు చేపట్టిన అటవీశాఖ

ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులులు, మనుషులపై దాడి నివారణకు అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించి తగిన సలహాలు, సూచనలు చేసేందుకు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (NTCA), వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) (డెహ్రడూన్) ప్రతినిధులను పంపాల్సిందిగా అటవీ శాఖ కోరింది. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (PCCF) ఎన్టీసీఏ తో మాట్లాడారు.

More Press News