హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు నాలా పటిష్టత, అభివృద్దికి రూ. 68.40 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం: మేయర్ బొంతు రామ్మోహన్
- వరద బాదిత కుటుంబాలను పరామర్శించుటకు ఇటీవల గోల్నాక ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా రిటైనింగ్ వాల్ కు హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్
- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో కలిసి నల్లకుంటలో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్
- భారీ వర్షాలతో తరచు ముంపుకు గురవుతున్న మూసి లోతట్టు కాలనీల రక్షణకు రీటైనింగ్ వాల్ నిర్మాణం - నెరవేరనున్న మంత్రి కేటీఆర్ హామీ
ఈ సందర్భంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుండి మూసి వరకు ఒక కిలోమీటర్ పొడవున మూసికి రిటైనింగ్ వాల్ నిర్మించి, ఈ ప్రాంతంలోని కాలనీల వరద ముంపు సమస్య పరిష్కరించనున్నట్లు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తదనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు ముఠా పద్మ, జి.శ్రీదేవి, ఇరిగేషన్ అధికారులతో కలిసి నల్లకుంటలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. వరద ముంపుకు గురవుతున్న కాలనీలలోని కుటుంబాలతో మేయర్ మాట్లాడారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ నుండి ప్రస్తుతం ఉన్న 8 కిలోమీటర్ల నాలాను రిటైనింగ్ వాల్ ను పటిష్టపర్చనున్నట్లు తెలిపారు. అలాగే గోల్నాక నుండి మూసి వరకు కొత్తగా ఒక కిలోమీటరు పొడవున రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో నీటి పారుదల విభాగం రిటైర్డ్ ఎస్.ఇ. వై.శేఖర్ రెడ్డి, ఇ.ఇ రేణుక, ఎ.ఇ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.