హైదరాబాద్ నగరంలో సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్యలు: మంత్రి కేటీఆర్
- జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన మంత్రి
- వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి వారి ఇంటి వద్దకే సిఎం రిలీఫ్ కిట్‌ను అందజేయాలి
- సిఎం రిలీఫ్ కిట్‌లో రూ.2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు
రూ.2,800 విలువ గల సిఎం రిలీఫ్ కిట్‌లో ఒక నెలకు సరిపడ నిత్యవసర వస్తువులతో పాటు 3 బ్లాంకెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే అన్ని చర్యలను యుద్దప్రాతిపదికన తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పటిష్టంగా నిర్వహించాలని తెలిపారు.యాంటి లార్వా స్ప్రేయింగ్, సోడియం హైపోక్లోరైట్, క్రిమీ సంహారక ద్రావనాలను అన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాలని ఆదేశించారు.
ఎంటమాలజి బృందాల ద్వారా కెమికల్స్ స్ప్రే చేయించాలని సూచించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, స్ప్రేయింగ్‌కు అవసరమైతే అదనంగా వాహనాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను తొలగించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరదల వలన నాలాలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బురదను, భవన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలను తొలగించుటకు అవసరమైన సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగించాలని తెలిపారు.అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య సంరక్షణపై నమ్మకాన్ని కలిగించాలని తెలిపారు. మొబైల్ మెడికల్ క్యాంపుల నిర్వహణలో జిహెచ్ఎంసితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డి.ఎం.ఇ డాక్టర్ శ్రీనివాస్‌కు సూచించారు. భారీ వర్షాలు, వరదతో దెబ్బతిన్న ఇళ్ల ఎన్యుమరేషన్‌ను చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఇన్.ఎస్.సి శ్రీదర్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, అదనపు కమిషనర్లు రాహుల్ రాజ్, సంతోష్, జోనల్ కమిషనర్లు బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.రవికిరణ్, ఉపేందర్‌రెడ్డి, సామ్రాట్ అశోక్, ప్రావిణ్య, వి.మమత తదితరులు పాల్గొన్నారు.