జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, విద్యుత్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
- భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ. 297 కోట్లతో పనులు - మంత్రి కేటీఆర్
- 24 గంటల్లో విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు ఆదేశం
- దెబ్బతిన్న సివరేజి, వాటర్ పైప్‌లైన్ల పునరుద్దరణ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చే రూ. 50 కోట్లతో పనులు
- వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ. 297 కోట్లతో పనులు చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రూ. 50 కోట్లతో దెబ్బతిన్న సివరేజి, వాటర్ పైప్‌లైన్ల పునరుద్దరణ పనులు చేపట్టాలని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇ.వి.డి.ఎం. డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఎం.డి రఘుమారెడ్డి, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, సిసిపి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు వరద బాధితుల సహాయార్థం ఒక నెల వేతనాన్ని సి.ఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించిన చెక్‌ను జిహెచ్ఎంసి కార్పొరేటర్లు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు అందజేశారు.
ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సి.ఇ.ఓ అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును కలిశారు. వారితో చర్చించిన మంత్రి రసూల్‌పుర నాలా అభివృద్ది పనులకు జిహెచ్ఎంసి నిధుల నుండి రూ. 6 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.