పిఎంజిఎస్ వై పనులు వేగంగా పూర్తి కావాలి: మంత్రి ఎర్రబెల్లి
- సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మన రాష్ట్రానికి మంజూరైన దాదాపు 158 రోడ్ల పనుల ప్రగతి మీద మంత్రి ఒక్కో అంశం వారీగా చర్చించారు. ఆయా పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. నిబంధనలకు లోబడి ఉన్న పనులను మొదటి ప్రాధాన్యతగా, ఇబ్బందులున్న పనుల సమస్యలను వెంట వెంట పరిష్కరిస్తూ వాటిని కూడా రెండో ప్రాధాన్యాంశాలుగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయా పనులను అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల ఇఎన్ సి, సిఇలు, డిఇఇలు, ఎఇలు తదితర అధికారులు పాల్గొన్నారు.