దుర్గం చెరువులో బోటింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ప్రారంభం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి హైదరాబాద్ లోని దుర్గం చెరువులో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ మరియు ఫ్లోటింగ్ రెస్టారెంట్లను స్థానిక శాసన సభ్యులు ఆరికెపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డితో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు, చారిత్రక నేపథ్యం గల ప్రదేశాలు, వారసత్వ సంపద, విస్తారమైన ఎకో పార్కులు, ట్రైబల్, టెంపుల్, బుద్ధిజం మరియు మెడికల్ టూరిజంకు హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె టి రామారావు కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సాగునీటి రిజర్వాయర్లను టూరిజం కేంద్రాలుగాను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక టూరిజం కేంద్రాలైనా లక్నవరం, సోమశిల, నాగార్జున సాగర్ లోని బుద్ధవనం, మహబూబ్ నగర్ లోని KCR అర్బన్ ఎకో టూరిజం పార్క్, అనంతగిరి హిల్స్ లతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అద్భుతమైన టూరిజం ప్రదేశాలు ఉన్నాయన్నారు. పర్యాటకులకు అనేక రకాల సౌకర్యాలను పర్యాటక కేంద్రాల వద్ద ఏర్పాటు చేశామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.