బెంగళూరు - మ్యూనిచ్ మధ్య కొత్త విమానం ప్రారంభించనున్న లుఫ్తాన్సా!
- అత్యాధునిక ఎ350-9005 ద్వారా నిర్వహించబడే, వారానికి 5 సార్లు నడపబడే విమానం
- కొత్త విమానం, భారతదేశపు సిలికాన్ వ్యాలీ మరియు 14 సంవత్సరాలలో ’యూరోప్ లోనే ఉత్తమ విమానాశ్రయం’గా పేరొందిన, యూరోప్ యొక్క మొట్టమొదటి, ఏకైక 5-స్టార్ ఎయిర్ పోర్ట్ మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పరుస్తుంది
లుఫ్తాన్జా, బెంగళూరు-మ్యూనిచ్ మార్గంలో ఒక కొత్త విమాన సర్వీసు ప్రారంభించడాన్ని ప్రకటించింది. ఈ క్రొత్త విమానం, 31 మార్చి 2020 నుండి, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు నుండి వారానికి ఐదు సార్లు, మ్యూనిచ్ కు వెళుతుంది. లుఫ్తాన్జా, తమ ఇటీవలి, అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ ఎ350-900 ను వ్యాపార తరగతిలో 48 సీట్లతో మరియు ప్రీమియం ఎకానమీ తరగతిలో 21 సీట్లతో మరియు ఎకానమీ తరగతిలో 224 సీట్ల సామర్థ్యంతో నడుపుతుంది.
ఈ కొత్త మార్గం, రెండు అతి ముఖ్యమైన ప్రాంతీయ హబ్స్ మధ్య ఒక బలమైన అనుసంధానం కలిగిస్తుంది. ఇది దక్షిణ భారతదేశాన్ని, యూరోపియన్ మెయిన్ ల్యాండ్ లోని అతి ముఖ్యమైన గేట్ వే తో నేరుగా అనుసంధానిస్తోంది. ఈ అభివృద్ధి అనేది లుఫ్తాన్జా యొక భారతీయ దృష్టికి అద్దంపడుతోంది. బెంగళూరులో తన కార్యనిర్వాహక విస్తరణతో, ఈ ఎయిర్ లైన్, తన అత్యంత ప్రీమియం ట్రావెల్ అనుభవాన్ని బెంగళూరు, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాల ప్రయాణీకులకే కాకుండా కేరళ, తమిళనాడు వారికి అందితూ, యూరోప్ కు అంతర్జాతీయ టాఫిక్ పెరుగుటకు దోహదపడు లక్ష్యం కలిగి ఉంది. లుఫ్తాన్జా, ఇదివరకే బెంగళూరు నుండి ఫ్రాంక్‌ఫర్ట్ కు ఒక రోజువారి విమాన సేవని నిర్వహిస్తోంది.
ప్రకటన గురించి మాట్లాడుతూ, జార్జ్ ఎఫియిల్, సీనియర్ డైరెక్టర్ సేల్స్, లుఫ్తాన్జా గ్రూపు ఎయిర్ లైన్స్ యొక్క దక్షిణ ఆసియా విభాగం, ఇలా అన్నారు. "బెంగళూరు ఎయిర్ పోర్ట్, భారతదేశపు ఐటి మరియు టెక్ హబ్, బెంగళూరును, అనుసంధానించడమే కాకుండా, దక్షిణ భారత ప్రాంతంలోని అనేక తదుపరి టైర్ నగరాలను కూడా అనుసంధానిస్తోంది. దక్షిణ భారతదేశంలో విదేశాలకు ప్రయాణించడానికి అనేకమంది ప్రయాణీకులు పెరుగుతున్నారు. ప్రీమియం ప్రయాణ అనుభవానికి ఎక్కువ డిమాండ్ ఉంది అది వ్యాపారమైనా లేదా విశ్రాంతి ఉద్దేశాలకైనా సరే, డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విస్త్రరణ ద్వారా, లుఫ్తాన్జా, ఈ ప్రాంతం యొక్క పెరుగుతున్న అవసరాలను పూరించగలదని. యూరోప్ లో వ్యాపారమే కాకుండా విశ్రాంతికి కూడా అనువైనదిగా ఉంచగలదని మేము భావిస్తున్నాము."
బెంగళూరు-మ్యూనిచ్ మార్గంలో ఒక అదనపు విమానం నడపాలనే లుఫ్తాన్జా నిర్ణయం, ఈ పెరుగుతున్న టాఫిక్ ను పరిగణిస్తూ తీసుకోబడింది, అంతే కాకుండా బెంగళూర్ ను దాటి అనుసంధానత అంశాలలో బెంగళూరు ఎయిర్ పోర్ట్ యొక్క సామర్థ్యాలను మరియు కార్యనిర్వహణ యొక్క వాణిజ్య సానుకూలతను కూడా పరిగణిస్తూ తీసుకోబడింది. ఇది కంపెనీ యొక్క దక్షిణ ఆసియా కార్యనిర్వహణను బలోపేతం చేయు దీర్ఘకాలిక సాదృశ్య్తతతో పనిచేస్తోంది. ఈ ఎయిర్ లైన్, ముంబై-మ్యూనిచ్ విభాగంలో ఇదివరకే, తన ఎయిర్ క్రాఫ్ట్ ను ఎ330 నుండి అత్యాధునిక ఎ350కు అప్ గ్రేడ్ చేసింది. ఇది వేసవి 2020 నుండి, చెన్నై మరియు బెంగళూరు నుండి ఫ్రాంక్ ఫర్ట్ కు తన విమానాలలో విభిన్న సీట్ అమరికతో వ్యాపార తరగతిలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని కూడా ప్రకటించింది.
టైమ్ టేబుల్ వివరాలు (అన్నీ స్థానిక సమయాలే):
వేసవి 2020
బెంగళూరు - మ్యూనిచ్LH 76501:45 – 07:30 సోమ/బుధ/శుక్ర/శని/ఆది
మ్యూనిచ్ - బెంగళూరుLH 764 11:55 – 00:05+1మంగళ/గురు/శుక్ర/శని/ఆది
లుఫ్తాన్జా గ్రూపు గురించి:
లుఫ్తాన్జా గ్రూపు, టర్నోవర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద వైమానిక గ్రూపు మరియు యూరోప్ ఎయిర్ లైన్ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉంది. ఈ గ్రూపు, తన వినియోగదారులు, ఉద్యోగులు, వాటాదారులు మరియు భాగస్వాములకు "విమాన యానంలో మొట్టమొదటి ఎంపిక" గా ఉంది. తన వ్యాపార కార్యాచరనలన్నింటిలోనూ భద్రత, నాణ్యత, విశ్వసనీయత మరియు సృజనాత్మకతలను ముఖ్య అంశాలుగా మరియు ప్రాధాన్యతలుగా కలిగి ఉంది.
లుఫ్తాన్జా గ్రూపు, మూడు వ్యూహాత్మక విభాగాలలో విభజించబడింది, అవి హబ్ ఎయిర్ లైనర్స్, పాయింట్ టు పాయింట్ వ్యాపారం మరియు సర్వీసు కంపెనీలు. ఈ గ్రూపు యొక్క నెట్వర్క్ క్యారియర్స్, వాటి లుఫ్తాన్జా ప్రీమియం బ్రాండ్స్, స్విస్ మరియు ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ తో పాటుగా, తన హోమ్ మార్కెట్ కు, వారి ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్, జ్యూరిచ్ మరియు వియాన్న హబ్స్ నుండి అందిస్తుంది. తన యూరోవింగ్స్ బ్రాండ్ తో, ఈ గ్రూపు, చినదైన మరియు దీర్ఘ-హౌల్ పాయింట్ టు పాయింట్ సర్వీసులను, అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ ట్రావెల్ మార్కెట్ కు కూడా అందిస్తోంది. బ్రుసెల్స్ ఎయిర్ లైన్ కూడా, ఈ పాయింట్ టు పాయింట్ సర్వీసులలో ఒక భాగమే. మరియు తన సర్వీస్ కంపెనీలతో, అంటే వాటి వ్యక్తిగత పరిశ్రమలలో ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన కంపెనీలు గా ఉన్న ఇవన్నిటితో, లుఫ్తాన్జా గ్రూపు, విమాన యాన వ్యాపారంలో మరిన్ని విభాగాలలో విజయం సాధించగలిగింది.
ఎదిల్వైజ్ అనేది ఒక ప్రముఖ స్విస్ హాలిడే ఎయిర్ లైన్ మరియు స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ యొక్క సోదరి కంపెనీ. 16 ఎయిర్ క్రాఫ్ట్స్ కలిగిన ఇది, ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలలోని 70 గమ్యస్థానాలకు తన సేవలను అందిస్తోంది మరియు సంవత్సరంలో దాదాపుగా 2.5 మిలియన్ అతిథులకు రవాణా సౌకర్యం అందిస్తోంది.
లుఫ్తాన్జా గ్రూపు ఎయిర్ లైన్స్, 103 దేశాలలోని 343 గమ్యస్థానాలకు, వేసవి 2019 లో 13,267 వారపు ఫ్రీక్వెన్సీలను అందించడం ద్వారా సేవలను అందిస్తోంది. ప్రస్తుత సమూహంలో 763 ఎయిర్ క్రాఫ్ట్స్ (ఫిబ్రవరి 2019 నాటికి) ఉన్నాయి మరియు ఈ గ్రొపు,2025 వరకు కొత్త ఎయిర్ క్రాఫ్ట్ బట్వాడాను తీసుకోవడం కొనసాగిస్తుంది. 2018లో, లుఫ్తాన్జా గ్రూపు, సుమారుగా 135,000 సిబ్బందిని నియమించింది, తన విమానాలలో 142 మిలియన్ ప్రయాణీకులను స్వాగతించింది మరియు సుమారు 35.8 బిలియన్ యూరోల వ్యాపారం సాధించింది.