జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా అధికారులకు టీ-పోల్ సాఫ్ట్ వేర్ పై శిక్షణ
అధునాతన సాంకేతిక ను వాడుక లో కి తీసుకువస్తే సామర్ధ్యం పెరగడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమీషనర్ సి. పార్థసారథి అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా సంబంధిత అధికారులకు టి -పోల్ సాఫ్ట్ వేర్ పై శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున ఎస్ఈసి కమీషనర్ పాల్గొన్నారు.
కోవిడ్ దృష్ట్యా పెద్ద ఎత్తున సాంకేతికతను వినియోగిస్తే ఎలక్షన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వెసలుబాటు కలుగుతుందని అన్నారు. ఆధునిక సాంకేతికతతో ఓటరు స్లిప్ ను, పోలింగ్ స్టేషన్ వివరాలు, నియోజకవర్గం వారీగా పోలింగ్ స్టేషన్ వివరాలను ఆన్లైన్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చని అన్నారు. నామినేషన్ నుండి ఎన్నికల ఫలితాలు వెల్లడి చేసే వరకు జరిగే ప్రకియ టెక్నాలజీ వలన సులభతరం అవుతుందన్నారు. టి పోల్ సాఫ్ట్ వేర్ ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా వుండే ఎలక్షన్ ప్రాసెస్ మేనేజిమెంట్, పోలింగ్ పర్సనల్ రాండోమైజెషన్, ఎలక్షన్ ఖర్చుల వివరాల మోడ్యూల్ తదితర అంశాలపై అధికారులకు శిక్షణ నివ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా టి పోల్ సాఫ్ట్ వేర్ గురించి అధికారులకు ప్రత్యక్షంగా శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. ఎస్ఈసి మాట్లాడుతూ ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వేర్ (Face Recognition Software ) ను ప్రతి వార్డ్ లోని ఒక పోలింగ్ స్టేషన్ లో పైలట్ ప్రతిపాదిన సుమారు 150 పోలింగ్ స్టేషన్లలో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత ఎన్నికలలో ఈ టెక్నాలజీను 10 పోలింగ్ స్టేషన్ లలో ఉపయోగించినట్లు తెలిపారు.
ఈ - ఓటింగ్ విధానాన్ని కూడా పైలట్ ప్రాతిపదికన ప్రవేశపెట్టె యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వయోవృద్దులు, వికలాంగులు, పోలింగ్ సిబ్బంది తదితరులకు ఈ -ఓటింగ్ ఉపకరిస్తుందన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ-ఓటింగ్ దేశంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుందన్నారు. టి పోల్, ఎస్ఈసి మోడ్యూల్స్, సంబంధిత యాప్స్ పై ఈ నెల 23వ తేదీ నుండి 29 తేదీ వరకు జీహెచ్ఎంసీ అధికారులకు శిక్షణ నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు.