సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మంత్రి తలసాని ఆదేశం
ప్రజల నుండి వచ్చే పిర్యాదులపై అధికారులు సకాలంలో స్పందిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సోమవారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రి డివిజన్ నేతాజీనగర్ లో 12 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. తమ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కాలనీ వాసులు పలువురు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. బస్తీ దవాఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ప్రావీణ్య ను మంత్రి ఆదేశించారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వచ్చిన పలు పిర్యాదులపై అధికారులు సకాలంలో స్పందించి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అనంతంరం నేతాజీనగర్ నుండి బాంబే బార్ వరకు ఉన్న నాలాను పరిశీలించారు. ఈ నాలా పూడికతో నిండిపోయి తరచుగా మురుగునీరు రహదారులపై ప్రవహిస్తుందని స్థానికులు మంత్రికి విన్నవించారు. మురుగునీటి వలన ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ నాలా విస్తరణ తో సమస్య పరిష్కారం అవుతుందని, వెంటనే అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
తదనంతరం బేగంబజార్ నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు. వర్షాకాలం లో ఈ నాలా ఉప్పొంగి నీరంతా సమీపంలోని ఇండ్లలోకి, దుఖాణాల లోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. స్థానిక ప్రజల సమస్య ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేదని, సమస్య ప్రాధాన్యత ను గుర్తించి వెంటనే ప్రభుత్వం నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. నాలా పనులను మరింత వేగవంతం చేయాలని, మిగిలిన ఆక్రమణలు వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మమత గుప్తా, శంకర్ యాదవ్, ghmc, వాటర్ వర్క్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.