నిరుపేద మహిళలకు పారిశ్రామిక శిక్షణ!
హైదరాబాద్, సెప్టెంబర్ 3ః ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణనిచ్చే వుమెన్-హబ్ సంస్థతో నిరుపేద ఔత్సాహిక మహిళలకు పరిశ్రమల మీద శిక్షణనిచ్చేందుకు వీలుగా సెర్ప్ ఒక అవగాహనకు వచ్చింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్-టిఎస్ ఐ పార్డ్ లో గురువారం జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ షాపు లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈ ఎంఓయు జరిగింది.
ఈ సందర్భంగా సెర్ప్ సిఇఓ సందీప్ కుమార్ సుల్తానియా, వి-హబ్ సిఇఓ దీప్తి రెడ్డిలు ఎంఓయు పత్రాలను పరస్పరం అందుకున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వి-హబ్, సెర్ప్ ఆధ్వర్యంలోని నిరుపేద మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ పలు అంశాలపై శిక్షణిస్తుంది. మహిళల సాధికారత దిశగా పని చేయాలని రెండు సంస్థలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టులతో జల విప్లవం వచ్చిందన్నారు. 24గంటల విద్యుత్, రుణాల మాఫీలు, రైతులకు పెట్టుబడులు, అందుబాటులో ఎరువులతో రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా సాగులోకి వచ్చిందని అన్నారు. జల విప్లవం... నీలి (మత్స్య) విప్లవానికి, గులాబీ (మాంసం) విప్లవానికి, శ్వేత(పాడి) విప్లవానికి దారి తీసిందన్నారు. అంచనాలకు మించి జరుగుతున్న సాగుతో భవిష్యత్తులో గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీన్ని అదిగమించడానికే సీఎం నియంత్రిత సాగు చేయాలని ఆలోచించారని మంత్రి తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారంగానే, వ్యవసాయాధారిత పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి తెలిపారు.
నిరుపేద మహిళలను సంఘతిట పరచి, రాష్ట్రంలో వేలాది మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపులో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచన మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కృషి వెలకట్టలేనిదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సెర్ప్ ఆధ్వర్యంలోనే ఇప్పటికే 65,362 మహిళా రైతులతో 14,131 రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19 జిల్లాల్లో యాక్టివ్ గా పని చేస్తున్న రైతు మహిళా ఉత్పత్తి సంఘాలతో రాష్ట్ర సమాఖ్యను ఏర్పాటు జరుగుతుందన్నారు. పేద మహిళల సమీకరణ, సంఘటిత పరచడంలో విజయం సాధించిన సెర్ప్ ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, విస్తరణకు కృషి చేయాలని ఆదేశించారు. భూ కమతాలు చిన్నగా ఉన్న రాష్ట్రంలో మహిళా రైతులను సంఘటితం చేయడంద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సెర్ప్ తీవ్రంగా కృషి చేస్తున్నదన్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జీవనోపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, సెర్ప్, సంస్థాగత కొనుగోలుదారులకు మార్కెటింగ్ మరియు విలువ ఆధారిత సేవలు బలోపేతానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు..
సెర్ప్, 2019 సెప్టెంబర్‌లో బేనిషాన్ రైతు ఉత్పత్తి దారుల కంపెనీ పేరిట రాష్ట్ర సమాఖ్యను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లా రైతు సమాఖ్యలకు సేవలు అందిస్తోందని, గడిచిన 11 నెలల్లో 1920 మెట్రిక్ టన్నుల పండ్లు మరియు కూరగాయలను వ్యాపారం చేసిందన్నారు. నారాయణ పేట రైతు కంపనీ ద్వారా 12 మెట్రిక్ టన్నుల కస్టర్డ్ ఆపిల్ గుజ్జును సేకరించి బేనిషాన్ ద్వారా విక్రయిచడం జరిగిందని మంత్రి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, బేనిషాన్ ద్వారా 717 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు మరియు కూరగాయలను, జిల్లా రైతు సమాఖ్య ల నుండి కొనుగోలు చేసి విక్రయిచడం జరిగింది. రూ. 3 కోట్ల 27 లక్షల టర్నోవర్ తో వ్యాపారం చేయగలిగిందని మంత్రి వివరించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటివనేక ఆహార శుద్ధి పరిశ్రమలున్నాయన్నారు. గ్రామీణాభివృద్ధిలో డిఆర్ డిఓలు, ఎడిఆర్ డిఓలు, డిపీవోల పాత్ర కీలమైంది. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర క్రీయాశీలమైంది. మహిళా సాధికారత సాధన దిశగా సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు, అధికారులు ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ పరిశ్రమల్లో మహిళలను భాగస్వాములను చేసి తెలంగాణను స్వయం సమృద్ధ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

మహిళల స్వయం సమృద్ధి, సాధికారతే లక్ష్యంగా, పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో ప్రభుత్వం వ్యవసాయానుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారంచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పేదరిక నిర్మూలన సంస్థ - సెర్ప్ ఆధ్వర్యంలో హైదరాబాద్- రాజేంద్రనగర్, టిఎస్ ఐ పార్డ్ లో నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ కి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.