తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో జీఓ 59 అమలుపై చైర్మన్ సమీక్ష

  • 70 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం జిఓ 59
  • దళితులను పారిశ్రామికవేత్తలుగా చేయటంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నిబద్దతకు నిదర్శనం జిఓ 59
  • డా. బి.ఆర్ అంబేద్కర్ కలను సాకారం చేసిన మొదటి సియంగా కెసిఆర్ చరిత్ర సృష్టించారు
  • జిఓ 59 దేశానికే ఆదర్శం, తెలంగాణ బాటలో కర్ణాటక మరియూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి
  • సింగరేణి యాజమాన్యం తో జిఓ 59 అమలుపై జరిగిన సమీక్షలో చైర్మన్ డా ఎర్రోళ్ళ 

నేడు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో జిఓ 59 అమలుపై చైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమీక్ష సమావేశంలో నిర్వహించారు.

దళితులను ప్రబుత్వ కాంట్రాక్టర్లుగా చూడాలన్న బాబా సాహెబ్ డా. బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ జిఓ 59 ను ప్రవేసపెట్టారు. చాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ జిఓ కమిషన్ కృషితో త్వరిత గతిలో ప్రవేశపెట్టటం జరిగింది.

దళితుల పారిశ్రామికవేత్తలుగా చేయటానికి దోహదపడే ఇటువంటి గొప్ప జిఓ అన్ని ప్రబుత్వ శాఖలలో అమలుకావటానికి కమిషన్ ముందునుండి ఎంతగానో కృషి చేస్తుంది. ఇదే అమలైతే ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్న దళిత వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. దళిత యువతకు స్వయం ఉపాది అందించి, ఆర్ధికంగా బలపడటానికి ఉద్దేశించిన ఈ జిఓ అమలు, దళిత వర్గాల అభివృద్ధి కి అనివార్యం అని చైర్మన్ పేర్కొన్న్నారు.

బాబా సాహెబ్ డా. బి.ఆర్ అంబేద్కర్ స్వాతంత్రానికి పూర్వం 1942 లో తనే స్వయంగా నిర్వహించిన సర్వే లో దళిత వర్గాలను కేవలం శ్రామిక వర్గాలుగానే చూశారు. బ్రిటిష్ పాలకులకు సమర్పించిన సర్వే రిపోర్ట్ లో దళిత వర్గాలకు అర్తికంగా అభివృద్ధి చేయాలంటే కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.


స్వతంత్రం పొందిన అనంతరం ఈ ప్రతిపాదనను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వత ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం   70 ఏళ్ల అంబేద్కర్ గారి కళను సాకారం చేస్తూ ఈ జివో ను ప్రవేశ పెట్టడం జరిగిందని చైర్మన్ తెలియజేశారు. ఈ జివో అమలు వల్లనే దళితుల అబివృద్ది జరుగుతుందని తము విశ్వసిస్తున్నామని డా ఎర్రోళ్ళ పేర్కొన్నారు. ఈ జివోలో ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో SC లకు 15% మరియు ST లకు 6% కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

సింగరేణి యాజమాన్యం తరుపున హాజరైన డైరెక్టర్ చంద్ర శేఖర్ స్పందిస్తూ దళితులకు మేలు చేసే ఇటువంటి గొప్ప జివో అమలుకై తాము సిద్దమని, దీనిని జాతీయ స్తాయి బోర్డ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకోవల్సి ఉందని, ఇది బోర్డ్ మీటింగ్ లో ఆమోదం పొందే విదంగా కృషి చేస్తానని చైర్మన్ గారికి హామీ ఇచ్చారు.

గతంలో కమిషన్ నిర్వహించిన సమీక్షా అనంతరం,  చైర్మన్ ఆదేశాలమేరకు విదేశీ శిక్షణ కు పంపే దళితులను 7 నుండి 11 కి పెంచడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించటమే కాకుండా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్ మరియు రాంబల్ నాయక్,  సింగరేణి డైరెక్టర్లు చంద్ర శేఖర్, బలరాం, జిఎం లు ఆనంద్ రావు , బసవయ్య తదితర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.

More Press News