వినాయ‌క చవితి మండపాలకు అనుమతి లేదు: మంత్రి వెల్లంపల్లి

  • కోవిడ్-19 నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి
  • ఈ సారికి ఇంట్లోనే విఘ్నేశ్వర పూజలు
  • ఏపీ దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస రావు
క‌రోనా నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు కోవిద్ -19 నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని, ఈ ఏడాదికి ప్ర‌జ‌లు అంద‌రు వారివారి గృహ‌ల్లోనే విఘ్నేశ్వర పూజలు నిర్వ‌హించుకోవాల‌ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస రావు తెలిపారు. బుధ‌వారం స‌చివాలంలో దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో  దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు, దేవ‌దాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ అజాద్ మ‌రియు డైరెక్ట‌ర్ ఫ‌ర్ హెల్త్ అరుణ‌కుమారి, లా అండ్ అర్డ‌ర్ అడిష‌న‌ల్ డిజి రాజ‌శేఖ‌ర్‌, డైరెక్ట‌ర్ ప్రోటోకాల్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ పొటోకాల్ రాంసుబ్బ‌య్య‌, త‌దిత‌రులతో మంత్రి వెల్లంపల్లి ‌స‌మావేశం నిర్వ‌హించారు.

క‌రోనా నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో జ‌రుగుతున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అదే విధంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వ నిభంధ‌న‌ల‌ను వివ‌రించారు. రెండు అడుగులలోపు వినాయ‌కుని విగ్ర‌హాలను మాత్ర‌మే పూజలు చేయ‌డం, అదే రోజు ఎక్క‌డ విగ్ర‌హాల‌ను అక్క‌డే నిమ‌జ్జ‌నం చేయాల‌న్నారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం లేదా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు అనుమతింంచ‌డం లేద‌న్నారు. అదేవిధంగా ఊరేగింపులు మరియు విగ్రహాన్ని న‌దులు, చెరువులో ముంచడం లేదన్నారు. క‌రోనా నివార‌ణకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని, అంద‌రూ వ్యక్తిగతంగా ఇంట్లోనే విఘ్నేశ్వర పూజలు నిర్వ‌హించుకోవాల‌ని మంత్రి వెల్లంపల్లి కోరారు.

ప్ర‌జ‌లు బ‌హిరంగ  ప్రదేశాలలో/ మార్కెట్ త‌దిత‌ర ప్రదేశాలను సంద‌ర్శించిన‌ప్ప‌డు త‌ప్ప‌నిస‌రిగా సామాజిక దూరం, ఫేస్ మాస్క్ ధరించాలని, అదే విధంగా దుకాణ‌దారులు నిబంధ‌న‌లు పాటించాలన్నారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేట్ ఆల‌యాల్లో ప్రభుత్వం జారీ చేసిన నిభంధ‌న‌ల ప్ర‌కారం ప‌రిమితి సంఖ్య‌లో 10మందితోనే సామాజిక దూరం పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధ‌రించి పూజలు నిర్వ‌హించుకోవాల‌న్నారు. అన్నీ దేవాల‌యాల్లో వినాయ‌కుని పూజ‌లు సంప్ర‌దాయ ప్ర‌కారం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిబంధ‌న‌ల పాటించాలన్నారు.

More Press News