స్వాతంత్రం ఫలాలు అందరికీ అందుతున్నాయి: తెలంగాణ హోంశాఖ మంత్రి
సంగారెడ్డి ఆగస్టు 15: స్వాతంత్రం ఫలాలు అందరికీ అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శనివారం నాడు నిర్వహించిన 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీస్ వందన సమర్పణ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. ఎంతోమంది త్యాగధనుల ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించిందన్నారు. కరొనా వైరస్ పై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కరొనా వైరస్ కు భయపడాల్సిన పని లేదని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కరోనాకు నిర్లక్ష్యం, భయం తో సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాంతకం అవుతుందన్నారు. ప్రభుత్వం కరోనా విషయంలో ప్రజలకు అన్నివిధాల అండగా ఉందన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైనన్ని మందులను అందుబాటులో ఉంచి చికిత్స లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోనే విజృంభించిన వైరస్ అక్కడ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టగా, జిల్లాలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, దానిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
జిల్లాలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం 100 పడకలు, ఎమ్మెన్నార్ వైద్య కళాశాలలో వంద పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు .జిల్లాలో అన్ని పీహెచ్సీలు ,అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో రాపిడ్ టెస్ట్ కిట్స్, పి పి ఈ కిట్స్, హోమ్ క్వారంటైన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందరూ అన్ని వేళలఅప్రమత్తంగా ,జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
రైతులకు సంబంధించిన ఏ పనిముట్టు , పరికరాలైనా అందరికీ ఉపయోగంలోకి, అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. యువ రైతులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని విధాల సహకారాన్ని అందిపుచ్చుకొని తమ ఆలోచనలతో రాణించాలని ఆయన సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని , యువత అటువైపు దృష్టి సారించాలన్నారు. ఆవిష్కర్తలకు అన్ని విధాల ప్రోత్సహిస్తామన్నారు.
అనంతరం జిల్లా నుండి ఎంపికైన ఆవిష్కరణల పనితీరును ఆయన పరిశీలించారు. ఆవిష్కర్తలు సంగమేశ్వర్, విగ్నేశ్వ ర్ లను అభినందించి సన్మానించారు. వీల్ బేస్డ్ ఫెర్టిలైజర్ స్ప్రే పంపు ఆవిష్కర్త సంగమేశ్వర్ కు డీ సి ఎం ఎస్ చైర్మన్ శివ కుమార్ 11 వేల రూపాయల చెక్కును ప్రోత్సాహకంగా అందించారు.
ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ,జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, అదనపు కలెక్టర్లు రాజర్షి షా ,వీరారెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి , వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, డి ఆర్ వో రాధిక రమణి, జిల్లా అధికారులు ,ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.