న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా ప్ర‌భుత్వ వైద్య సేవ‌లు

  • నేడు మ‌రో 25 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభించిన గౌర‌వ మంత్రులు, మేయ‌ర్, ఎం.పి లు, ఎమ్మెల్యేలు ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు
హైద‌రాబాద్‌, ఆగ‌ష్టు 14: న‌గ‌రంలో నేడు మ‌రో 25 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభించడం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు కె.తార‌క‌రామారావు, ఈటెల రాజేంద‌ర్‌, మ‌హ్మ‌ద్ మ‌హ్మూద్ అలీ, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, పార్ల‌మెంట్ స‌భ్యులు, శాస‌న స‌భ్యులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలో 168 బ‌స్తీ ద‌వాఖానాలు ప‌ని చేస్తున్నాయి. దీంతో మొత్తం బ‌స్తీ ద‌వాఖానాల సంఖ్య 193 కు పెరిగాయి.

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం హ‌బ్సిగూడ వార్డు రాంరెడ్డిన‌గ‌ర్‌లో నెల‌కోల్పిన బ‌స్తీ ద‌వాఖానాను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

యాక‌త్‌పుర నియోజ‌క‌వ‌ర్గం సంతోష్‌న‌గ‌ర్ వార్డు జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ లో నెల‌కోల్పిన బ‌స్తీ ద‌వాఖానాను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర హోం మంత్రి మ‌హ్మ‌ద్ మ‌హ్మూద్ అలీ, రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, శాస‌న స‌భ్యులు స‌య్య‌ద్ అహ్మ‌ద్ పాషా ఖాద్రి, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ సర్కిల్ క‌వాడిగుడలో నెలకొల్పిన బస్తీ దవాఖానను జి హెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాసనసభ్యులు ముఠా గోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న కాలనీలు, బస్తీవాసులకు ప్రాధమిక వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి వార్డుకు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య హైదరాబాద్ నిర్మాణమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాలు మేరకు బస్తీ దవాఖానల ఏర్పాటుకు అవసరమైన వసతులను జిహెచ్ఎంసి కల్పిస్తున్నది. పేదలు, బస్తీ వాసులకు మ‌రింత‌ చేరువగా ప్రాధమిక వైద్యం అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

*జిహెచ్ఎంసి పరిధిలో వున్న బస్తీ దవాఖానలు వివ‌రాలు*

ప్రస్తుతం నడుస్తున్నవి- 168
ఈ రోజు ప్రారంబిస్తున్నవి-25
మొత్తం బస్తీదవాఖానల సంఖ్య-193

More Press News