కేటీఆర్ 'గిఫ్ట్ ఎ స్మైల్' పిలుపుకి భారీగా స్పందన
- అంబులెన్స్ వాహనాలకు నిధుల వెల్లువ
- నేడు కేటీఆర్ కి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి-వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
- టిఆర్ఎస్ నాయకులు ఒద్దిరాజు రవిచంద్ర, కాకులమారి లక్ష్మణ్ రావు
- మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ల సమక్షంలో ప్రగతి భవన్ లో కేటీఆర్ కి అప్పగింత
- నిధులు అందచేసిన ఎమ్మెల్యేలు, టిఆర్ ఎస్ నాయకులను అభినందించిన కేటీఆర్, మంత్రులు
తాజాగా బుధవారం వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్ పర్సన్, నేతలు వాహనాలకు అవసరమైన చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ల సమక్షంలో అందచేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన సతీమణి వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యతిలు ఒక వాహనానికి అవసరమైన నిధుల చెక్కుని అందచేశారు. అలాగే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరో వాహనం కోసం చెక్కుని అందచేశారు. టిఆర్ఎస్ నాయకులు ఒద్దిరాజు రవిచంద్ర, కాకులమాను లక్ష్మణ్ రావులు ఒక్కో వాహనానికి అవసరమైన చెక్కులను మంత్రుల సమక్షంలో కేటీఆర్ కి అందచేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా కరోనా బాధితులను ఆదుకోవడానికి అవసరమైన అంబులెన్స్ వాహనాల కోసం అనేక మంది ఎమ్మెల్యేలు, నేతలు చెక్కులు అందచేయడాన్ని అభినందించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమాల కోసం, కరోనా బాధితులను ఆదుకోవడం కోసం తమ తమ నియోకవర్గాల్లో నిరంతరం కృషి చేస్తున్న నేతలు ఇలా...సేవకు ముందుకు రావడం వాళ్ళ ఔదార్యానికి నిదర్శనమన్నారు. వాళ్ళని అభినందించారు. అలాగే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, కేటీఆర్ పిలుపునకు స్పందించి అంబులెన్స్ వాహనాలకు అవసరమైన నిధులను ఇవ్వడం ఆయా నేతల ప్రజాసేవ నిబద్ధతకు నిదర్శనమన్నారు. వారిని అభినందించారు.
కాగా, ఇంతకుముందే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కేటీఆర్ కి చెక్కుని అందచేశారు. ఇదిలావుండగా ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.