మధ్యప్రదేశ్ లో పర్యటించిన తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ

  • తెలంగాణ రాష్ట్ర బిసి & మేదరి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ మధ్యప్రదేశ్ లోని దీవాస్ పట్టణంలో పర్యటించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వృత్తి కులాల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలు వారి జీవితాలలో వెలుగులను నింపుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజుల్లో కార్పొరేట్ స్థాయిని తట్టుకొని వృత్తిదారులు డిమాండ్ కు తగ్గ ఉత్పత్తిని చేసి తమ మనుగడ సాధించాలంటే వారికి ఆధునీకరణ ఎంతో అవసరం.

ఇట్టి విషయాన్నీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శుల సూచన మేరకు బిసి కార్పొరేషన్, మేదరి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ మేదర కులస్తులకు ఆధునిక యంత్రాలను అందించే యోచనతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన వివిధ యంత్రాలను పరిశీలించేందుకు దీవాస్ పట్టణంలో పర్యటిస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హైద్రాబాద్ కు దగ్గరలో గల శ్రీ రమానంద తీర్థలో మేదర కులస్తులకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించడం జరిగిందని అన్నారు. వారికి తగిన యంత్రాలను కూడా సబ్సిడీ ద్వారా అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీటిపై అవగాహన కల్పించుకునేందుకే ఈ పర్యటన చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షుడు వెంకట్ రాముడు, శ్రీనివాస్, సాయన్న, మాదవి తదితరులు పాల్గొన్నారు.

More Press News