ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా 'పులిగడ్డ సత్యనారాయణ' నియామకం
విజయవాడ: సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్(ఎస్‌జెఆర్‌వో) ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పులిగడ్డ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామకపు పత్రాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ నీలం సహనీ, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు పంపించారు.
అలాగే త్వరలో పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టి ఆర్గనైజేషన్ ని ముందుకు నడిపించాలని ఆదేశించారు. చిన్నతనం నుంచి కష్టపడే మనస్తత్వం కలిగి నీతిగా నిజాయితీగా ఉంటూ నిక్కచ్చిగా మాట్లాడటం, తాను చెప్పటిన సమస్య పరిష్కారం అయ్యేవరకు అలుపెరుగని పోరాటం చేస్తూ ఉండటం వంటి పలు అంశాలతో పాటు క్రమశిక్షణతో పాత్రికేయ విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయడం, ప్రజాసమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం, సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాలను గుర్తించి రాష్ట్ర కమిటీ పులిగడ్డ కు బాధ్యతలు అప్పగించినట్లు జక్కా సాయిబాబు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎస్‌జెఆర్‌వో ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎన్నికైన పులిగడ్డ సత్యనారాయణ కు సూచించారు.