రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఇండ్ల అమ్మకానికి విధివిధానాలు ఖరారు చేయండి: అధికారులకు మంత్రి వేముల ఆదేశం
- బహిరంగ మార్కేట్ లో అర్ధవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయండి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఇందులో బండ్లగూడా టౌన్ షిప్ నందు 2246 ప్లాట్స్ పోచారం టౌన్ షిప్ నందు 1470 మొత్తం సుమారుగా ఈ 3716 నిర్మించబడి ఉన్న ప్లాట్స్ ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం ఉందో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. గృహాల అమ్మకం విలువలు ఇంకా కొంత మెరుగు పరిచి, బహిరంగ మార్కెట్ లో అర్ధవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయాలని అధికారులను మరియు వాల్యుయర్స్ సంస్థ ను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ,రాజీవ్ స్వగృహ డైరెక్టర్,ఎస్.ఈ రవీందర్ రెడ్డి, జనరల్ మేనేజర్స్ మరియు వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.