పల్లెల అభివృద్ది లక్ష్యంగా పల్లె ప్రగతి: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి
- జిల్లాలో నార్కట్ పల్లి,కట్టంగుర్ మండలం లలో పర్యటించి పల్లె ప్రగతి పనులు పరిశీలించిన రాష్ట్ర పంచాయతి రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
- జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పల్లె ప్రగతి పనులు పురోగతి పై అధికారులతో సమీక్ష
- వైకుంఠ ధామం లు తొందరగా పూర్తి చేయాలి,దసరా లోగా రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి
- కంపోస్ట్ షెడ్ లు వినియోగించి చెత్త సెగ్రీ గేషన్ చేయాలి
- అర్హత ఉన్న ప్రతి ఎస్.హెచ్.జి.గ్రూప్ కు బ్యాంక్ లింకెజీ రుణం అంద చేయాలి
ముందుగా నార్కట్ పల్లి గ్రామం లో రాహదారుల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలను పరిశీలించారు.అనంతరం గ్రామం లో నిర్మిస్తున్న వైకుంఠ ధామం, పక్కనే పూర్తి చేసిన కంపోస్ట్ షెడ్ పరిశీలించారు.గ్రామం లో చెత్త సేకరణ జరిపిన తర్వాత కంపోస్ట్ షెడ్ కు వచ్చిన తర్వాత తడి,పొడి చెత్త, ప్లాస్టిక్, సీసం చెత్త నుండి వేరు చేయాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులకు చెత్త వేరు చేయడం పై ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు.చెత్త నుండి వేరు చేసిన ప్లాస్టిక్ ను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు అమ్మితే వారు పి.యం.జి.ఎస్.వై. కింద రహదార్ల నిర్మాణంలో ప్లాస్టిక్ ను 10 శాతం వినియోగిస్తారని, గ్రామ పంచాయతీ కి ఆదాయం కూడా వస్తుందని అన్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం కోసం గుర్తించిన స్థలం పరిశీలించి మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనం లో వాకింగ్ ట్రాక్,మొక్కలు నాటే విధానం గురించి సూచనలు చేశారు. తర్వాత కట్టంగూర్ మండలం పామనగుంట్ల గ్రామంలో పల్లె ప్రగతి వనం, పక్కనే రైతు వేదిక నిర్మాణ స్థలం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గ్రామంలో మురికి కాల్వ పరిశీలించి చెత్త తొలగించ క పోవడం చూసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్, జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి, ఎం.పి.డి. ఓ., స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సమీక్ష
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ.లు, ఎం.పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ డి.ఈ.లు, ఏ.ఈ.లు అధికారులతో పల్లె ప్రగతి లో జిల్లాలో చేపట్టిన వైకుంఠ ధామం లు, డంప్ యార్డ్ లు, కంపోస్ట్ షెడ్ లు, పల్లె ప్రగతి వనం లు,హరిత హరం,రైతు వేదికల నిర్మాణం, నూర్పిడి కల్లా ల నిర్మాణం ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి కార్యక్రమం నల్గొండ జిల్లాలో బాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు చేపట్టాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మొదటి ప్రాధాన్యత నివ్వాలి అన్నారు. ఏ రాష్ట్రం లో కూడా పల్లెల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమం అమలు కావడం లేదని, పల్లెలు పరిశుభ్రంగా తయారు అవుతున్నట్లు, ప్రజలు కూడా బాగా స్పందన వస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన సమావేశం లో పల్లె ప్రగతి పనుల గురించి వివరించారని తెలిపారు.పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పనులు అమలుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను నియమించినట్లు తెలిపారు.పంచాయతీ రాజ్ శాఖ లో ఖాళీ పోస్టులు భర్తీ చేసినట్లు,కార్యదర్శి పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ లకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు.గ్రామ పంచాయతీ ల కు 339 కోట్ల నిధులు నెల నెలా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుండి 308 కోట్లు నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.తక్కువ జనాభా వున్న జి.పి.లలో కూడా ఏప్రిల్ నుండి సంవత్సరం కు కనీసం ఐదు లక్షలు జనరల్ గ్రాంట్ వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రం లో కూడా పల్లె ప్రగతి కార్యక్రమం లాంటి అమలు చేయడం లేదని,అధికారులు ఇదొక అవకాశం గా భావించి గ్రామం అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని,బాగా పని చేస్తే ప్రజలు మన్ననలు పొందుతారని,కొన్ని చోట్ల బాగా పని చేసే అధికారులను ప్రజలు సత్కరిస్తారని, తమకు మంచి పేరు జిల్లా కు మంచి పేరు వస్తుందని అన్నారు.
నిధులు,పోస్టులు భర్తీ,ప్రతి జి.పి.లో ట్రాక్టర్ కొనుగోలు,ట్రాలీ,ట్యాంకర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.అధికారులు సాకులు చెప్పి తప్పించు కునే అవకాశం లేదని పనులు నాణ్యతా ప్రమాణాలు రాజీ పడకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.వైకుంఠ ధామం లు నిర్మాణం ప్రగతి పై పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.నెలరోజుల్లో వైకుంఠ ధామం ల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు.కంపోస్ట్ షెడ్ లు నిర్మాణం పూర్తి చేయడమే కాక చెత్త సెగ్రి గేషన్ జరగాలని,వాటిని వాడుకలో తీసుకు రావాలని,చెత్త సేకరణ చేసి డంప్ యార్డ్ తరలించి చెత్త వేరు చేయాలని అన్నారు.
ప్రతి రోజు మురుగు కాల్వలు శుభ్రం చేయాలని,పరి శుభ్రంగా వుండాలని అన్నారు.లెక్కల కోసం కాకుండా గ్రామం లో ఫలితాలు కనిపించాలని అన్నారు.జిల్లా కలెక్టర్,జిల్లా అధికారులు పర్యటించి పరిశీలన లో పనులు జరగకుం టే చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమర్థుడు , డైనమిక్ అన్న పేరు వుంది.జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,ఎం.పి.డి. ఓ.లు,పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు,ఎం.పి. ఓ.లు ,కార్యదర్శుల కలిసి కట్టుగా పనిచేసి చేసి పనులు తొందరగా పూర్తి చేసి జిల్లా ను రాష్ట్రంలో ముందు వరుసలో నిలూపాలని అన్నారు.ప్రతి జి.పి.మొక్కలు 85 శాతం బతకాలని,పంచాయతీ రాజ్ చట్టం లో పేర్కొన్నట్లు,సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి లదే బాధ్యత అని అన్నారు.
ఎం.పి. ఓ.లు.ప్రతి రోజు పనులు పర్యవేక్షణ చేయాలి,పనులు ప్రగతి లో వెనుకబడ్డ గ్రామాల లో జిల్లా పంచాయతి అధికారి పర్యవేక్షణ చేయాలని అన్నారు.జిల్లా లో 650 కంపోస్ట్ షెడ్ లు పూర్తి చేసినట్లు,వాటిని వాడుకోవాలని,ప్రభుత్వం మాన్యు వల్ పంపించినట్లు తెలిపారు.వైకుంఠ ధామం ల చుట్టూ ప్రహరీ లాగా చెట్లు పెంచి బయో ఫెన్సింగ్ చేయాలని ఆదేశించారు.ప్రతి జి.పి.లో ఒక ఎకరం స్థలం లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని,పిల్లలకు,వయో వృద్దులకు వాకింగ్ చేయడానికి ఉపయోగం గా వుంటుందని అన్నారు.పిల్లలు,యువకులు,ఎస్.హెచ్.జి.మహిళలు అందరినీ భాగస్వామ్యం చేసి పల్లె ప్రకృతి వనం,హరిత హరం లో మొక్కలు నాటాలని అన్నారు.పల్లె ప్రకృతి వనం నిర్వహణకు వాచ్ అండ్ వార్డ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు.
రైతు వేదికలు దసరా లోగా నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు,రైతు వేదిక ల నిర్మాణం కు కావలసిన మెటీరియల్ రెండు రోజుల్లో సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.జిల్లాలో 140 క్లస్టర్ లలో ఒకే సారి పనులు మొదలు పెట్టీ తొందరగా పూర్తి చేయాలని అన్నారు.జిల్లా పంచాయతీ సిబ్బంది ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు.రైతు లు పంటలు ఆర పొందేందుకు ఈ. జి.ఎస్ ద్వారా నూర్పి డి కల్లాలు నిర్మాణం కు వర్క్ కమెన్స్ మెంట్ ఆర్డర్ మంజూరు చేయాలని అన్నా రు. ఈ.జి.ఎస్ ద్వారా ప్రతి కూలికి పని కల్పించాలి.
ఎస్.హెచ్.జి.బ్యాంక్ లింకెజి రుణాలు సమీక్ష: అర్తత గల ప్రతి స్వయం సహాయ బృందానికి బ్యాంక్ లింకేజీ రుణం మంజూరు చేయాలని అన్నారు.సి.,డి.,కేటగిరీ లో వెనుక బడ్డ సంఘాలు పై దృష్టి సారించి లోపాలు సరిచేయాలని అన్నారు. జీవనోపాదుల ప్రణాళిక అమలుకు ప్రణాళిక రూపొందించి ముందుకు పోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయుటకు మెటీరియల్ ప్రొక్యూర్ మెంట్ చేసి నిర్దేశిత సమయం లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.హరిత హరం,ఇతర పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమాసింగ్,జడ్.పి.సి. ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిపి ఓ విష్ణు వర్ధన్,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.