'హాఫ్ వే హోమ్' నిర్మాణ డిజైన్ లను వెంటనే సమర్పించండి: తెలంగాణ సీఎస్ ఆదేశం
మానసిక సమస్యలతో బాధపడి ఆరోగ్య వంతులైన వారి కోసం ఏర్పాటు చేయతలపెట్టిన Half Way Home నిర్మాణ డిజైన్ లను వెంటనే సమర్పించాలని సి.యస్ ఆదేశించారు. గురువారం సచివాలయంలో మెంటల్ హెల్త్ కు సంబంధించి రూపొందించవలసిన కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగధీశ్వర్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమీషనర్ యోగితారాణా, వికలాంగుల సంక్షేమ శాఖ కమీషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి స్క్రీనింగ్ కు సంబంధించి గ్రామ స్ధాయిలో ఆశావర్కర్లు, ANM లు, PHC స్ధాయిలో డాక్టర్లు, జిల్లా స్ధాయిలో మెడికల్ ఆఫీసర్లు సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయడంతో పాటు అవసరమైన శిక్షణా మాడ్యూల్ ను తయారు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో సైక్రియాటిస్టుల సేవలను వివియోగించుకునేలా చూడాలన్నారు. మానవవనరుల సేవలను సద్వినియోగం చేసుకుంటు టెలీకాలర్ సేవలను అందించాలన్నారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ట్రైనింగ్ మాడ్యూల్ కిట్లను ఆశా వర్కర్లకు, ANM లకు, PHC డాక్టర్లకు అందివ్వాలన్నారు. మెంటల్ ఇల్ నెస్ పై వైద్య శాఖ సిబ్బందిని సెన్సిటైజ్ చేయాలన్నారు. డాక్టర్ల శిక్షణా కార్యక్రమాలను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక వ్యూహంతో మానసిక అనారోగ్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు.