ఎదురుగట్ట అడవికి "కేసీఆర్ వనం"గా నామకరణం: మంత్రి గంగుల కమలాకర్

  • దసరా కల్లా రైతు కల్లాలు, రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలి
  • హరితహారంకు 1కోటి రూ.నిధులు... కేటాయించిన మంత్రి
  • జిల్లా కేంద్రంలో అందమైన మొక్కలు నాటలి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నీళ్లు తో పాటు పచ్చని చెట్లు ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు కలెక్టర్ సమావేశ మందిరంలో హరితహారం, రైతు వేదికలు, రైతు కల్లాల నిర్మాణాల పురోగతిపై కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అందమైన పూల మొక్కలు నాటాలని అన్నారు... కరీంనగర్ జిల్లా అడవుల పెంపకం లో చాలా వెనుకబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ నాలుగు మున్సిపాలిటీలలో ప్రత్యేక దృష్టితో హరితహారం నిర్వహిస్తామని అన్నారు.

కాంక్రీట్  జంగల్ గా ఉన్న నా కరీంనగర్ ను హరిత వనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కసిగా పని చేయాలని సూచించారు. డి ఎంఎఫ్ టీ నిధుల నుండి హరితహారానికి ఒక కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ కు 50 లక్షలు చొప్పదండి మున్సిపాలిటీ 30 లక్షలు కొత్తపల్లి మున్సిపాలిటీకి 20 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా ఉండేందుకే ఇప్పటికే మున్సిపల్ నిధులతో పాటు గ్రీన్ ఫండ్ ,డి ఎం ఎఫ్ టి  నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని 14.5 కిలో మీటర్ల ప్రధాన రహదారులతో పాటు, జిల్లా సరిహద్దుల వరకు గల ఆర్&బి రోడ్లకు ఇరువైపులా సాధ్యమైనంత వరకు 2 లేదా 3 వరుసలు చెట్లు నాటాలని, అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు వ్ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధి తో నిర్వహించాలని పేర్కొన్నారు.

చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని నాటిన మొక్కలు 80శాతం కచ్చితంగా కాపాడాలని అన్నారు..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ పదవులు కూడా కోల్పోవాల్సి వస్తదని మంత్రి హెచ్చరించారు..ప్రజాప్రతినిధులు ,అధికారులు జవాబుదారీతనం తో పని చేసి హరితహారం లో అద్భుత ఫలితాలు రాబట్టలని పేర్కొన్నారు..

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు వెదురుగట్ట అడవికి  " కేసీఆర్ వనం " అని నామకరణం చేసి తీర్మానం చేసినారు... వెదురుగట్ట హరితహారం లో భాగంగా అద్భుతంగా మొక్కలు నాటారని మంత్రి రవిశంకర్ ను అభినందించారు... కురిక్యాల గ్రామంలో ని బొమ్మలగుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

దసరా కల్లా రైతు వేదికలు, రైతు కల్లాలు పూర్తి కావాలి: మంత్రి

రైతు కల్లాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్లు కేటాయించిందని ,ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున 1లక్ష  రైతు కల్లాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో 320 రైతు కల్లాలు నిర్మించేందుకు  రైతులు దరఖాస్తు చేసుకున్నారని, జిల్లాకు 22కోట్లు నిధులు మంజూరు కబడ్డాయని పేర్కొన్నారు. అర్హులైన రైతులు దసరాకల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. దానికి తగ్గట్లుగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు.

జిల్లాలో చిన్న, సన్నకారు, పెద్ద రైతులు జాతీయ ఉపాధిహామీ పథకం కింద పంటను ఆరబెట్టుకోవడానికి వీలుగా సొంత పొలంలో సిమెంట్‌ కల్లాలు నిర్మించుకోవడానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కల్లాల నిర్మాణానికి ఆసక్తిగల రైతులు తమ పేర్లు సంబంధిత ఎంపీడీవో, ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్‌ కాస్ట్‌ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, జనరల్‌ రైతులకు యూనిట్‌ కాస్ట్‌ 10 శాతం డబ్బులు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా కల్లాలు నిర్మిస్తారన్నారు. రైతులు  పండించిన పంటలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం కళాశాల నిర్మాణానికి సబ్సిడీ ఇస్తోందని అన్నారు.

ఈ కల్లాల నిర్మాణానికి ఆసక్తిగల రైతులు సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపు మెంబర్స్‌ అయి ఉండాలన్నారు. ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉన్న రైతులు అర్హులన్నారు. రైతులు ముందుగా సొంత ఖర్చులతో సూచించిన కొలతలు, నియమాలతో కల్లాలు నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రెండు విడుతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు.
KCR

More Press News