మరో ఫ్లైఓవర్ కు ఈ నెల 11న శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
- రూ. 426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు ఈ నెల 11న శంకుస్థాపన చేయనున్న మంత్రి కె.టి.ఆర్ - నగర మేయర్ బొంతు రామ్మోహన్
- రూ. 350 కోట్లతో ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి
- రూ. 76 కోట్లతో రాంనగర్ నుండి బాగ్‌లింగంపల్లి పేజ్-2 సెంకడ్ లేవల్ లో నిర్మించనున్న 3 లేన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి
ఈ పనులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు:
1. పనిపేరు: ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి (ఫేజ్-1) వరకు నాలుగు లేన్ల రెండు వైపులా వాహనాల రాకపోకలకు అనువుగా ఎలివేటర్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
పొడవు: 2.620 కిలోమీటర్లు
నిర్మాణ వ్యయం: రూ. 350 కోట్లు
స్ట్రక్చర్ టైప్ : స్టీల్ బ్రిడ్జి
ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో కలిగే ప్రయోజనాలు:
- ఇందిరా పార్కు సమీపం నుండి వి.ఎస్.టి జంక్షన్ వరకు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్
- ప్రయాణ సమయం తగ్గుతుంది.
- హిందీ మహా విద్యాలయ& ఉస్మానియా యూనివర్సిటీల వైపు ట్రాఫిక్ సమస్య తొలుగుతుంది.
- ఆర్టీసి క్రాస్ రోడ్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు ఉపశమనం కలుగుతుంది.
- ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్ క్రాస్ రోడ్, ఆర్టీసికాలనీ క్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి ట్రాఫిక్ సమస్య తొలుగుతుంది.
2. పని పేరు: రాంనగర్ నుండి వయా వి.ఎస్.టి ఆజామబాద్ ద్వారా బాగ్‌లింగంపల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మాణం
పొడవు: 0.850 కిలోమీటర్లు
నిర్మాణ వ్యయం: రూ. 76 కోట్లు
స్ట్రక్చర్ టైప్ : స్టీల్ బ్రిడ్జి
ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో కలిగే ప్రయోజనాలు:
- ఈ పని పూర్తి అయితే రాంనగర్ నుండి బాగ్‌లింగంపల్లి వరకు ట్రాఫిక్ రద్దీ సమస్య తొలగి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఏర్పడుతుంది.
- ట్రాఫిక్ సమస్య తొలగి వాహనదారుల సమయం ఆదా అవుతుంది.