పీఎంజీఎస్‌వై-3, బ్యాచ్-1 కింద రూ.658.31 కోట్ల విలువైన ప‌నులకు కేంద్రం ఆమోదం.. కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

  • 1,119.94 కి.మీ. మేర‌, 152 ప‌నుల‌కు అనుమ‌తులు
  • కేంద్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
హైద‌రాబాద్, జూన్ 22ః ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి పంపిన పీఎంజీఎస్‌వై ఫేజ్-3, బ్యాచ్ -1 ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. 1,119.94 కి.మీ. మేర‌, 152 ప‌నుల‌కు అనుమ‌తులు ల‌భించాయి. దీంతో రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలు, ఆవాసాలు, ఏజెన్సీ ప్రాంతాల‌కు రోడ్లు వేసే అవ‌కాశం క‌లుగుతుంది. కొత్త‌గా గ్రామాల నుంచి మండ‌ల కేంద్రాల‌కు లింకు రోడ్లు కూడా వేసే వీలుంటుంది. నిర్ణీత నిబంధ‌న‌ల మేర‌కు ఆయా ప‌నులు చేప‌ట్ట‌డానికి వీలుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు లేఖ అందింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర బెల్లి ద‌యాక‌ర్ రావు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే  కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన ప‌నులను వెంట‌నే ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆయా ప‌నుల‌ను నాణ్య‌త‌తో, వేగంగా పూర్తి అయ్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

More Press News