హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్

  • గుర్రంగూడలో ఆరోగ్య సంజీవని వనం ప్రారంభించిన చీఫ్ సెక్రటరీ, అధికారులు
  • వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్ఫాట్ ల ఏర్పాటు

హైదరాబాద్ వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఎల్ బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో గుర్రం గూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరుతో ఫారెస్ట్ పార్కును చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, అటవీ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఎల్ బీ నగర్, బీ.ఎన్.రెడ్డి నగర్, తుర్కయంజాల్, నాదర్ గుల్, మన్నెగూడ పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం ఉపయోగపడేలా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో అర్బన్ పార్కును అటవీ శాఖ అభివృద్ది పరిచింది.

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆరోగ్య సంజీవని వనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన చీఫ్ సెక్రెటరీ SK జోషి:


హాజరైన ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, PccF పీకే ఝా, ఆటవీశాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది

More Press News