కేవలం 3 నెలల్లోనే 75.5 శాతం ఉపాధి పనులు పూర్తి చేశాం: మంత్రి ఎర్రబెల్లి

  • వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం చెన్నారం గ్రామంలో మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తో నీటి పారుదల శాఖ కు అనుసంధానం చేసిన దేవాదుల పంట కాలువల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి
  • అనంతరం వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం లోని సంగెం మండలం గవిచర్ల గ్రామం లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తో నీటి పారుదల శాఖ ను అనుసంధానం చేసిన దేవాదుల పంట కాలువల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి
ఆయా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతమ్ సదానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్*
  • ఉపాధి హామీ పనులు కేవలం వరంగల్ జిల్లా కో, చెన్నారం గ్రామానికి పరిమితం కాదు
  • రాష్ట్ర వ్యాప్తంగా, దేశం లో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకాన్ని నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ వంటి పలు శాఖలకు అనుసంధానం చేయడం మామూలు విషయం కాదు
  • సీఎం కేసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల సాధ్యమైంది
  • దేవాదుల వంటి అనేక ప్రాజెక్టులను పెండింగ్ లో పెడితే, అలాంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘన కేసిఆర్ ది
  • కాళేశ్వరం వంటి అధునాతన, అనితర సాధ్యమైన ప్రాజెక్టుని డిజైన్ చేసి, కేవలం రెండున్నర ఏళ్ళల్లో నే పూర్తి చేసిన మహాత్ముడు సీఎం కేసిఆర్
  • ఉపాధి హామీ పనులు గతంలో ఉపయోగపడే విధంగా జరగలేదు
  • ఉపాధి హామీ పై ప్రత్యేక శ్రద్ధతో రూ.1200 కోట్లతో  భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగ పడే పనులు చేయాలన్నది సీఎం కేసిఆర్ గారి లక్ష్యం
  • అందులో భాగంగానే కొత్తగా లక్ష జాబ్ కార్డులు ఇచ్చాం
  • ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 75.5 శాతం ఉపాధి పనులు పూర్తి చేశాం
  • టార్గెట్ ని మించి ఉపాధి పనులు చేస్తాం
  • దేశం లోనే నెంబర్ వన్ గా మన రాష్ట్రం నిలిచింది
  • వైలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం
  • వెయ్యి కోట్లతో రైతులకు కల్లాలు , రూ.500 కోట్లతో రైతు వేదికలు, రూ.500 కోట్లతో గోదాములు నిర్మిస్తున్నాంప్రజలకు 24 గంటల విద్యుత్ కోసం ఒక్కో మోటార్ కోసం రూ.60 వేలను ప్రభుత్వం చెల్లించి, సబ్సిడీ గా ఇస్తున్నది
  • రైతు బంధు, రైతు బీమా, విత్తనాలు వంటి అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం
  • కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో, కష్టకాలం లో రాజకీయాలకు అతీతంగా పని చేయాలి
  • పార్టీలు రాజకీయాలకు పోకుండా, ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను
  • దేవాదుల ప్రాజెక్ట్ tail end చివరి చెన్నారం, గవిచర్ల గ్రామాలకు నీరు అందిస్తున్నాం
  • ఈ ప్రాంత చెరువులను నింపే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన మంత్రి
*ఎమ్మెల్యే  చల్లా ధర్మా రెడ్డి కామెంట్స్*

  • ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసిఆర్ శ్రమ ఎంత ఉందో..ఈ ప్రాంతానికి నీరు రావడంలో మంత్రి ఎర్రబెల్లి గారి శ్రమ అంత ఉంది
  • ఈ ప్రాంతం పై ప్రత్యేక శ్రద్ధతో మంత్రి దయాకర్ రావు పని చేస్తున్నారు
  • ఉపాధి హామీ పథకం అంటే... ఉత్త పథకం గా గతంలో పేరు ఉండేది
  • ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల, వ్యవసాయం వంటి పలు శాఖలకు విస్తరింప చేయడం మన రాష్ట్ర ప్రజల అదృష్టం

*ఎమ్మెల్యే ఆరురి రమేశ్ కామెంట్స్*

  • ఆగిపోయిన కాలువలకు మోక్షం కలిగించిన cm కేసిఆర్ గారికి, మంత్రి దయాకర్ రావు గారికి ధన్యవాదాలు
  • గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారు
  • తెలంగాణ వచ్చాక ఒక్క గవిచర్ల మాత్రమే కాదు... రాష్ట్ర రైతాంగం సంతోషంగా ఉండే విధంగా రైతుల పథకాలు ఉన్నాయి
  • ఈ ప్రాంతానికి శాశ్వత ప్రాతిపదికన సాగు నీరు అందేలా చూడాలి
*రజత్ కుమార్ కామెంట్స్*

  • తెలంగాణ లో జరుగుతున్న పనులు దేశం లో కాదు.. ప్రపంచం లోనే జరగడం లేదు
  • ఎక్కడా ఇన్ని కార్యక్రమాలు జరగడం లేదు
  • గుజరాత్ లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కి కూడా 37 ఏళ్లు పట్టాయి
  • పెండింగ్ ప్రాజెక్టు లే కాదు... కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు ని డిజైన్ చేసి, కేవలం రెండేళ్ళలో నే ప్రారంభం అయ్యాయి
  • ఇంత వేగంగా పనులు ఎక్కడా జరగడం లేదు
  • ప్రతి రైతు కి సాగు నీరు అందలనేది సీఎం కేసిఆర్ గారి లక్ష్యం
  • రూ.1200 కోట్లతో ఉపాధి పనులు జరుగుతున్నాయి
  • ఉపాధి హామీ కింద వరంగల్ రూరల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు ఒనగూరే లాభం
  • రూ. కోటి.94లక్షలతో 162 కి. మీ. మేర ఫీల్డ్ ఛానెల్స్ నిర్మాణం జరుగుతుంది
  • రూ.3 కోట్ల.7లక్షలతో...137 కి. మీ. మేర బౌండరీ ట్రెంచ్ ల నిర్మాణం జరుగుతుంది
  • దేవాదుల tail end చివరలో ఉన్న.. చెన్నా రం, గవిచ ర్ల గ్రామాలకు సాగు నీరు అందుతుంది. చెరువులు నిండుతాయి. కాలువల ద్వారా నీరు రావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయి

More Press News