బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయ అభివృద్దికి కృషి చేస్తున్నాం: మంత్రి తలసాని

బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఆలయ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ముందు దాతల సహకారంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ నామన శేషుకుమారి తో కలిసి ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం ప్రతినిత్యం ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం దాతల అందజేసిన విరాళాలు 35 లక్షల రూపాయల వ్యయంతో షెడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. షెడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చిన దాతలను ఈ సందర్బంగా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ eo శర్మ, కుమార్, నారాయణరాజు, ఉమానాద్ గౌడ్, రమేష్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

More Press News