మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌నకు ఏర్పాట్లు ముమ్మ‌రం

  • రూ.650కోట్ల విలువైన ప‌లు అభివృద్ధి పనుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు
  • ప‌క‌డ్బందీగా ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు జ‌ర‌గాల‌ని నిర్ణ‌యం
  • క‌రోనా నేప‌థ్యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు
  • కెటిఆర్ ప్రారంభించ‌నున్న అభివృద్ధి ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
  • అనంత‌రం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కుడా చైర్మ‌న్, మేయ‌ర్, క‌లెక్ట‌ర్, క‌మిష‌న‌ర్ల‌తో స‌మీక్ష
వ‌రంగ‌ల్, జూన్ 13ః రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఈ నెల 17న వ‌రంగ‌ల్ లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న నేప‌థ్యంలో కాక‌తీయ పట్ట‌ణాభివృద్ధి సంస్థ‌, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ఆధ్వ‌ర్యంలో ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల‌ను శ‌నివారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో, జిల్లా క‌లెక్ట‌ర్, పోలీస్ క‌మిష‌న‌ర్, న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ తో క‌లిసి ప‌రిశీలించారు.

అనంత‌రం ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, ఎంపీలు బండా ప్ర‌కాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, పోలీసు క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ వి. ర‌వింద‌ర్, వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, వ‌రంగ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ చింతా స‌దానందం త‌దిత‌రుల‌తో క‌లిసి హ‌న్మ‌కొండ‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు రానున్న త‌రుణంలో కుడా, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి కెటిఆర్ దాదాపు రూ.650 కోట్ల విలువైన ప‌లు ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తార‌న్నారు. ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు కార్య‌క్ర‌మాలుంటాయ‌ని మంత్రి వివ‌రించారు. ఆయా కార్య‌క్ర‌మాల అనంత‌రం వ‌రంగ‌ల్ న‌గ‌రం, కుడా అభివృద్ధిపై స‌మీక్ష చేస్తార‌ని మంత్రి తెలిపారు. కెటిఆర్ కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

*కుడా ఆధ్వ‌ర్యంలో స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని రాంపూర్ లో నిర్మిస్తున్న ఆక్సీజ‌న్ పార్క్ కి, వ‌ర్ద‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మంజూరైన 200 రెండు ప‌డ‌క‌ల గ‌దుల భ‌వ‌న స‌ముదాయ నిర్మాణ ప‌నుల‌కు కాజీపేట క‌డిపికొండ బ్రిడ్జి వ‌ద్ద శంకుస్థాప‌న చేస్తారు.
*వ‌రంగ‌ల్ న‌గ‌రానికి చేరుకునే న‌ర్స‌పేట‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారుల‌లో స్వాగ‌త ద్వారాల‌కు మంత్రి కెటిఆర్ శంకుస్థాప‌న చేస్తారు.
*వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో గ‌ల బాల స‌ముద్రంలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్ లో 593 రెండు ప‌డ‌క‌ల గ‌దుల భ‌వ‌నాల స‌ముదాయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. అక్క‌డే కాజీపేట‌లో నిర్మించే 97 రెండు ప‌డ‌క‌ల గ‌దుల గృహాల స‌ముదాయానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాప‌న చేస్తారు.
*త‌ద‌నంత‌రం వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని బ‌ట్ట‌ల బ‌జారు వై ఆకారంలో గ‌ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జీని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. మురుగునీరు శుద్ధి ప్లాంట్ నాయుడి పేట పెట్రోల్ పంపు నుండి  రెడ్డి పాలెం వ‌ర‌కు 8 కి.మీ. మేర ఇన్న‌ర్ రింగ్ రోడ్డుకు కెటిఆర్ శంకుస్థాప‌న చేస్తారు.
*వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర మున్సిపల్ కార్పోరేష‌న్ వ‌ద్ద ఏర్పాటు చేసిన పోత‌న జంక్ష‌న్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు.
*కుడా ఆధ్వ‌ర్యంలో వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన న‌ర్స‌రీని మంత్రి కెటిఆర్ ప‌రిశీలిస్తారు.

More Press News