తెలంగాణ భూములలో బంగారం పండుతోంది: మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ భూములలో బంగారం పండుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు కావాల్సిన ఆహారపు ఉత్పత్తులను పండించగల సామర్ధ్యం ఇక్కడి భూములకు ఉందని ఆయన వెల్లడించారు. అటువంటి భూములలో డిమాండ్ ఉన్న పంటలను సాగు చెయ్యగలిగినప్పుడే రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే శక్తి చేకూరుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన ఋణమేళలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయం మీద విశ్వాసం పెరిగిందన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన చేయుతతో పండుగగా జరుపుకుంటున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. అటువంటి రైతాంగాన్ని నియంత్రిత సాగు వైపుమళ్లించి ప్రతి రైతును ఆర్ధికంగా పరిపుష్టం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంగా ఆయన అభివర్ణించారు.

వ్యవసాయానికి మొదటగా అందుబాటులో నీరు ఉండాలి అని రెండవది పెట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. కృష్ణా, గోదావరిలను మగణాల్లోకి మళ్లించి 40 లక్షల ఏకరాలకు నీళ్లు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబందు రూపంలో పెట్టుబడి అందించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మిగిలింది మూడవది పండించిన పంట కు గిట్టుబాటు ధర కల్పించడం అని ఆయన తెలిపారు. ఆ గిట్టుబాటు ధర కోసం రూపొందించిన ప్రణాళిక నియంత్రిత సాగు అని ఆయన తేల్చిచెప్పారు.

తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన నియంత్రిత సాగులో మొదట రైతును సంఘటితం చెయ్యడం అని ఆపై మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తే దరనిర్ణయించే శక్తి రైతుకు వస్తుందని ఆ దిశగా రైతులు ఆలోచన చెయ్యాలని ఆయన ఉద్బోధించారు. అందుకు మంత్రి కొన్ని ఉదాహరణలు ప్రస్తావిస్తూ ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాలలో కందిని పండించవచ్చన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కందికి రంది లేదన్నారు.

అంతే గాకుండా ఎకరా వరికి 25 వేల నుండి 30 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని వచ్చే ఆదాయం మాత్రం 40 నుండి 45 వేలు కాగా ఎకరాకు 10 వేలు పెట్టుబడితో సాగు చేసే కంది మీద 60 వేల పై చిలుకు లాభర్జన గడించ వచ్చని ఆయన లెక్కలతో సహా సవివరంగా వివరించారు. టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించిన  ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, డి సి యం యస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయా సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,సూర్యపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ  తదితరులు పాల్గొన్నారు.

More Press News