32 జిల్లాల్లో లక్ష కళ్ళాలు నిర్మించాలని క్యాబినెట్ ఉపసంఘం నిర్ణయం!
- 32 జిల్లాలు లక్ష కళ్ళాలు
- పల్లెపల్లెనా కళ్లాలు
- ధాన్యం రోడ్డెక్కకుండా చర్యలు
- ఒక్కో కళ్ళానికి 46.045 లు
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి తీర్మానం
- మంత్రుల నివాస ప్రాంగణంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
- పాల్గొన్న క్యాబినెట్ ఉపసంఘం సభ్యులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, దయాకర్ రావు తదితరులు
ఒక్కో కళ్ళానికి 46,045 రూపాయలుగా అంచనా వేసిన ఉప సంఘం కళ్ళం ఎత్తు 45 సెంటిమిటర్లు గా 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేలా చేసిన నమూనాలు వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపించిన కళ్ళాల నిర్మాణాల ప్రతి పాదనలలో అయ్యే వ్యయం ఉపాధి హామీ పథకం కింద కేటాయింపులు ఉండేలా చూడాలని తీర్మానించారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలో నిర్మించ తలపెట్టిన కళ్ళాల నిర్మాణాలు రైతులకు ప్రయోజనకారిగా ఉంటాయని ఉపసంఘం అభిప్రాయపడింది.
45 లక్షల ఎకరాలలో వరి:
ఇదిలా ఉండగా 2020-21లలో రాష్ట్రంలో 40 నుండి 45 లక్షల ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉన్నట్లు ఉపసంఘం అంచనా వేసింది. అయితే *(యన్. ఆర్. ఎల్. యం.)*_ నేషనల్ రూరల్ లైవిలీ హుడ్ మిషన్ కింద వ్యవసాయ ఉత్పత్తులతో పాటు సేంద్రియ ఎరువుల తయారీకి ప్రోత్సహం కల్పించడంతో పాటు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఉప సంఘం నిర్ణయించింది. అంతే గాకుండా స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్ ఫామ్ నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.