ప‌ల్లెల్లో పచ్చ‌ద‌నం-పరిశుభ్ర‌త వెల్లివిరియాలి: తెలంగాణ మంత్రి పువ్వాడ

  • పల్లె, పట్టణ ప్రగతిలో మనం రెండవ స్థానంలో ఉన్నాం
  • రూ.1.10 కోట్లతో సీసీ, సైడ్ డ్రైన్ కు శంకుస్థాపన
  • తల్లడలో ఆకస్మిక తనిఖీ...ఫైన్
  • ఈ వానాకాలంలో నియంత్రిత పంట‌ల‌నే వేయాల‌ని రైతుల‌కు విజ్ఞప్తి
  • రైతును రాజును చేయాలని సిఎం కెసిఆర్ సంక‌ల్పించారు
ఖమ్మం\అంజనాపురం: ప‌ల్లెలే దేశానికి ప‌ట్టుగొమ్మలని ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌కు నిల‌యాలు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పారిశుధ్య వరోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా తల్లడ మండలం అంజనపురం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. తొలుత గ్రామంలో రూ.1.10 కోట్లతో అంజనాపురం ఎస్సి కాలనీ నుండి బిల్లుపాడు ఎస్సి కాలనీ వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ కాల్వకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..  ప‌ల్లెల్లో పారిశుద్ధ్యం ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలని, ప‌రిశుభ్ర‌మైన ప‌ల్లెలు మానవ మనుగడకు, ఆరోగ్యానికి కూడా నిల‌యాలుగా మారుతాయని అన్నారు. ఖమ్మం జిల్లా పల్లె, పట్టణ ప్రగతిలో రెండవ స్థానంలో ఉందన్నారు. అందుకు జిల్లా అధికార యంత్రగాన్ని అభినందించారు. గ్రామాల్లో పరిశుభ్రత ద్వారానే ఈ వానాకాలం సీజ‌న్ లో ప్ర‌బ‌లే అంటు, సీజ‌న‌ల్ వ్యాధుల‌ను కూడా అరిక‌ట్టగలుగుతామన్నారు. నూటికి 70శాతం ప్ర‌జ‌లు గ్రామాల్లో ఉంటున్నారని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. గ్రామాలు ప‌చ్చ‌గా, ప‌రిశుభ్ర‌త‌తో ఉండాలి, స్వ‌యం స‌మృద్ధంగా ఎద‌గాలి అదే సీఎం గారి ఆశ‌యం అన్నారు.

అందుకే గ్రామాల‌ను, ప‌ట్ట‌ణాల‌ను మొత్తం తెలంగాణ‌ను స్వ‌యం స‌మృద్ధంగా, స‌ర్వ‌తోముకాభివృద్ధిగా తీర్చిదిద్దుతున్నార‌న్నారని పేర్కొన్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గతి, ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌, హ‌రిత హారం వంటి అనేక కార్య‌క్ర‌మాలు కూడా అభివృద్ధి, సంక్షేమాల‌తో స‌మంగా అమ‌లు చేస్తున్నార‌న్నారు. అలాగే పచ్చ‌ద‌నం-పారిశుద్ధ్యం ద్వారా గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, త‌ద్వారా క‌రోనాతో పాటు ఈ వానాకాలంలో వ‌చ్చే సీజ‌న‌ల్, అంటు వ్యాధుల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని మంత్రి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. లాభసాటి పంటలను వేసుకోవాలని తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర పంటల విధానం తీసుకొచ్చారని అన్నారు.

రైతుల‌కు రుణ మాఫీ, పంట‌ల పెట్టుబ‌డులు, ఉచిత విద్యుత్, అందుబాటులో విత్త‌నాలు, ఎరువులు, రైతు బీమా, చివ‌ర‌కు పంట‌ల కొనుగోలు కూడా చేస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొన్నదని గుర్తు చేశారు.

తల్లడలో... ఆక‌స్మిక త‌నిఖీ... కాలువ‌ల ప‌రిశీల‌న‌

తల్లడ ప్రధాన రహదారిపై మంత్రి పువ్వాడ కాలువ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధి హామీ ప‌నులు జ‌రుగుతున్నాయా? అని ఎమ్మెల్యే, స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కూలీల‌కు క‌నీసం రూ.200 ఒక రోజుకి వ‌చ్చే విధంగా ప‌నులు చేయించాల‌ని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌న్నారు. దుకాణాల ముందు చెత్త పేరుకుపోయి ఉండటాన్ని చూసి దుకాణదారునికి ఫైన్ వేయాలని ఆదేశించారు. మృగశిర కార్తీ సందర్బంగా చేపలు విక్రయిస్తున్న వారితో మాట్లాడారు. వ్యాపారాలు చేసుకుంటూ పరిశుభ్రతను పాటించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటారని సూచించారు.

కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు కలెక్టర్ స్నేహాలత, జడ్పీ సీఈఓ ప్రియాంక, సర్పంచ్, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

More Press News