పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి తలసాని

తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బన్సిలాల్ పేట డివిజన్ పద్మారావు నగర్ లోని స్కందగిరి కాలనీ లో పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి మొక్కను నాటి నీరు పోశారు.

అనంతరం ghmc పారిశుధ్య సిబ్బందికి చెత్తను తరలించే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని వివరించారు. పారిశుధ్య నిర్వహణలో ప్రజలు ghmc సిబ్బందికి సహకరించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే వేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు జాగ్రత్త తో ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ నెల 1 నుండి 8 వ తేదీ వరకు పారిశుధ్య నిర్వహణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత తో కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.

మురుగునీరు నిల్వ ఉండటం, ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు పెరగడం, చెత్త కుప్పలు ఎక్కువ రోజలు రుకపోవడం వలన దోమలు ఎక్కువగా పెరుగుతాయని ghmc అధికారులు మంత్రికి ఈ సందర్బంగా వివరించారు. సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటింటికి వెళ్లి వివరించి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహింఛి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ghmc అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు నగర్ trs పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, dc ముకుందరెడ్డి, ఈ శ్రీనివాస్, amoh రవీందర్ గౌడ్, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, స్కందగిరి కాలనీ ప్రెసిడెంట్ భగవాన్, సెక్రెటరీ పట్నాయక్, పద్మారావు నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, సెక్రెటరీ చక్రధర్, gk రావు, పలు కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

More Press News